Friendship : ఓటీటీలో అర్జున్ – హర్భజన్ సినిమా

యాక్షన్ కింగ్ అర్జున్ - హర్భజన్ నటించిన ‘ఫ్రెండ్ షిప్’ మూవీ ఓటీటీలో విడుదలవనుంది..

Friendship : ఓటీటీలో అర్జున్ – హర్భజన్ సినిమా

Friendship

Friendship: ‘క్రికెట్ కింగ్’ హర్భజన్ సింగ్, ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కలయికలో… రూ. 25 కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం ‘‘ఫ్రెండ్ షిప్’’.. జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘‘ఫ్రెండ్ షిప్’’ పేరుతోనే.. ‘సింగ్ అండ్ కింగ్’ అనే ట్యాగ్‌లైన్ జోడించి.. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై  నిర్మాత ఏ.ఎన్. బాలాజీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Kondapolam : రివ్యూ..

కానీ ఓటీటీలోనే విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు నిర్మాతలు.. ఇప్పుడిప్పుడే థియేటర్ పరిస్థితులు చక్కబడుతున్నాయి.. తమ అభిమాన క్రికెటర్‌ను వెండితెర మీద చూడాలనుకున్న హర్భజన్ ఫ్యాన్స్‌కి అలాగే అర్జున్ అభిమానులకు నిరాశ ఎదురయ్యింది. ‘ఫ్రెండ్‌షిప్’ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

Tamil Stars : అన్ని కోట్లిచ్చి టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నారా?

దసరా కానుకగా అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. లోస్లియా ఫీమేల్ లీడ్ కాగా కమెడియన్ సతీష్ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. అర్జున్, హర్భజన్ అభిమానులను ‘ఫ్రెండ్ షిప్’ మూవీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు మూవీ టీం.

Kajal Aggarwal : ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్ సూన్?