Mount Everest : ఎవరెస్టు శిఖరమా? డంపింగ్ యార్డా? .. ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో వైరల్

మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తరలివస్తుంటారు. వచ్చిన వారంతా శిఖరం చుట్టూ వేసుకున్న గుడారాల వద్ద చెత్తా, చెదారాన్ని నింపేస్తున్నారు. దాంతో శిఖరం చుట్టు పక్కల ప్రాంతాలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి.

Garbage on Mount Everest : చోటు దొరకాలే కానీ జనం చెత్త వేయడానికి జనం రెడీగా ఉంటారు అనిపిస్తుంది ఇప్పుడు చదవబోయే వార్త. అద్భుతాలకు నెలవైన ఎవరెస్టు శిఖరాన్ని కూడా డంపింగ్ యార్డ్ చేసేస్తున్నారు పర్వతారోహకులు. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Neeraj Chaudhary : కరోనాను జయించి..ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండాను రెపరెపలాడించి..

ఏటా వేలాదిమంది సందర్శించే అతి పెద్ద బేస్ క్యాంపులలో ఎవరెస్టు శిఖరం ఒకటి. ఈ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తుల గురించి ఎంతో చక్కని కథనాలు వెలువడుతుంటాయి. అయితే ఈ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చేవారు మాత్రం ఇక్కడ పరిసరాల్ని అపరిశుభ్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో పర్వతం చుట్టూ గుడారాలు కనిపిస్తున్నాయి. వాటితో పాటు కింద పేరుకుపోయిన చెత్తా చెదారం కూడా కనిపిస్తున్నాయి. ‘మనుష్యులు ఎవరెస్ట్ పర్వతం దగ్గర సైతం  చెత్త, ప్లాస్టిక్ కాలుష్యాన్ని డంపింగ్ చేయకుండా వదిలిపెట్టరు. నిజంగా చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది’ అనే శీర్షికతో షేర్ చేశారు. అయితే మొదట ఈ వీడియోని ఎవరెస్ట్ టుడే లో షేర్ చేశారు.

ఒకే సీజన్‌లో 2సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ : మొత్తం ఐదుసార్లు ఎక్కి రికార్డు సాధించిన ఘనతకు ‘పద్మశ్రీ’

ఇక ఈ వీడియోపై చాలామంది స్పందించారు. ‘ప్రకృతిని సంరక్షించాలంటే మానవుడు దానికి దూరంగా ఉండాలని’ ఒకరు.. ‘చాలా బాధాకరంగా ఉంది.. ఇలాంటి వాటిని నిరోధించాలంటే కొన్ని చట్టాలు రావాలని’ మరొకరు ఇలా వరుసగా కామెంట్లు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు