ఒకే సీజన్‌లో 2సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ : మొత్తం ఐదుసార్లు ఎక్కి రికార్డు సాధించిన ఘనతకు ‘పద్మశ్రీ’

ఒకే సీజన్‌లో 2సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ : మొత్తం ఐదుసార్లు ఎక్కి రికార్డు సాధించిన ఘనతకు ‘పద్మశ్రీ’

padma shri awardee anshu jamsenpa climbed mount everest 5 times : మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. ఎంతో శ్రమ, పట్టుదల, కష్టం ఉంటేనేగానీ అదిసాధ్యం కాదు. అటువంటిది అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 41 ఏళ్ల అన్షు జమ్సేన్పా ఒకేసీజన్ లో రెండుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అద్భుతమైన ఘనత సాధించారు. ఒకే సీజన్‌లో రెండుసార్లు ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి మహిళగా వార్తల్లో నిలిచారు అన్షు జమ్సేన్పా. ఆమె సాధించిన ఘనతకు 2021 రిపబ్లిక్‌ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అంతేకాదు ఆమె ఇప్పటి వరకూ మొత్తం ఐదుసార్లు ఎవరెస్ట్ ను అధిరోహించారు.

ఐదు సార్లు అధిరోహించిన ఘతన..
జీవితంలో ఒక్కసారయినా ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కాలని కలలు కనేవారికి ఆదర్శనంగా నిలుస్తున్నారు అన్షు జమ్సేన్పా. ఒకసారికాదు ఏకంగా ఐదుసార్లు ఎవరెస్టుని అధిరోహించిన అన్షు జమ్సేన్పా వెరీ వెరీ స్పెషల్ అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిరాంగ్‌ జన్మించిన అన్షు ఇద్దరు పిల్లల తల్లి. ఎవరెస్ట్ ఎక్కాలనే కోరికతో 2009లో పర్వతారోహణ ప్రారంభించింది.

దీని గురించి అన్షు మాట్లాడుతూ..‘నేను అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో పాల్గొనేదానిననీ దాంట్లో పలు సందర్భాల్లో విజయం సాధించేదాన్నని తెలిపారు. రాక్‌ క్లైంబింగ్‌ చేసే సమయంలో అరుణాచల్‌ పర్వతారోహణ, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ వాళ్లు నా ప్రతిభ గుర్తించి ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నా భర్తతో వారు మాట్లాడి..ఆమెలో మంచి ప్రతిభ ఉంది. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే ప్రతిభ ఉంది. అని చెప్పి ఆయనను ఒప్పించి తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు అన్షు.

ఒక్కసారి ఎక్కా వెనుతిరిగి చూడలేదు : అన్షు
అలా..ఒకసారి నేను ఎవరెస్ట్‌ ఎక్కడం మొదలుపెట్టాను..ఆ తరువాత నేను వెనక్కి తిరిగి చూడలేదు’ అని చెప్పుకొచ్చారామె. ఎవరెస్ట్ ను అధిరోహణ కష్టమే.. అయినా ఇష్టం ఉంటే ఏదీ కష్టం కాదన్నట్లుగా ఆ ఇష్టంతోనే కఠినమైనదాన్ని సాధించగలిగానని తెలిపారు అన్షు. ఎవరెస్ట్ ను శిఖరాన్ని మొదటిసారి జయించిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది..అంటూ ఆ సందర్భాన్ని సంతోషానని వ్యక్తం చేస్తుంది అన్షు. మొదటిసారి అంత ఎత్తులో ఉన్న శిఖరాన్ని అధిరోహించనప్పుడు నాకు దేవుడుని అతి దగ్గరగా చూసినంత ఆనందం కలిగిందని చెప్పారు. నా కలలో నేను చూసిన సన్నివేశం నా కళ్ల ముందు సాక్షిత్కరించేసరికి నా ఆనందం అంతా ఇంతా కాదని చిన్నపిల్లలా సంబరపడిపోతూ చెబుతారు 41 ఏళ్ల అన్షు.

అన్షు తండ్రి ఇండోటిబెట్‌ సరిహద్దులో ఒక పోలీసు అధికారి, తల్లి నర్సు. ఎవరెస్టును జయించటానికి అన్షు రన్నింగ్, జిమ్, యోగా, ఏరోబిక్స్‌ వంటివి నేర్చుకుంది. మొదట చిన్న చిన్న పర్వతాలను అధిరోహించడం ద్వారా అలవాటు చేసుకుని క్రమేపీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే తన లక్ష్యాన్ని ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదుసార్లు తన కలను నెరవేర్చుకుంది.