Heroins: క్యారక్టర్ కోసం హోమ్ వర్క్.. ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్న హీరోయిన్స్

హీరోయిన్లు ఈ మధ్య మారుతున్నారు. స్క్రీన్ మీద తమ ప్రజెన్స్ ని ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. ఏదో డైరెక్టర్ చెప్పినట్టు యాక్ట్ చెయ్యడమే కాకుండా.. ఆ క్యారెక్టర్ కోసం రీసెర్చ్ లు..

Heroins: క్యారక్టర్ కోసం హోమ్ వర్క్.. ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్న హీరోయిన్స్

Heroins

Heroins: హీరోయిన్లు ఈ మధ్య మారుతున్నారు. స్క్రీన్ మీద తమ ప్రజెన్స్ ని ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. ఏదో డైరెక్టర్ చెప్పినట్టు యాక్ట్ చెయ్యడమే కాకుండా.. ఆ క్యారెక్టర్ కోసం రీసెర్చ్ లు చేస్తున్నారు. క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా తెలుసుకుని హోమ్ వర్క్ చేస్తున్నారు. అందుకోసం హీరోయిన్లు తెగ కష్టపడుతున్నారు. డైరెక్టర్లు చెప్పినట్టు చెయ్యడమే కాకుండా ముందుగానే పర్ పెక్షన్ కోసం తాపత్రయపడుతున్నారు.

Vijay Devarakonda: రెస్ట్ మోడ్‌లో రౌడీ హీరో.. అంతా కరోనా పుణ్యమే!

రెట్రోలవ్ స్టోరీగా రిలీజ్ కు రెడీ అయిన రాదేశ్యామ్ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో టీచర్ క్యారెక్టర్ లో ప్రేరణగా నటించిన పూజా.. అప్పటి డ్రెస్సింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో పాటు ఆ క్యారెక్టర్ లో నటించడానికి చాలా హోమ్ వర్క్ చేశానని చెబుతోంది.

Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

సౌత్ స్టార్ హీరోయిన్ అయిన సమంత కూడా ఇంకా నేర్చుకుంటున్నా అంటోంది. పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా ఊఊ అంటావా పాటకు.. ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ కోసం చాలా కష్టపడ్డానంటోంది సమంత. అంతేకాదు.. హాలీవుడ్ లో చెయ్యబోతున్న అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమా కోసం కూడా కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటున్నానంటోంది సమంత.

Film Celebrities: సెలబ్రిటీలను చుట్టేస్తున్న కరోనా.. ఉదృతంగా వ్యాప్తి!

పుష్ప సినిమాలో హీరోయిన్ చేసిన రష్మిక బేసిక్ గా కన్నడ అమ్మాయి. అలాంటిది తెలుగులో డబ్బింగ్ చెప్పడమే కాదు.. సినిమా కోసం చిత్తూరు యాస నేర్చుకుని శభాష్ అనిపించుకుంది. పుష్ప సినిమాలో రష్మిక యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ తో పాటు యాసతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

Kannada Heroins: సిల్వర్ స్క్రీన్‌పై కన్నడ భామల జోరు!

శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్ గా చేసిన సాయిపల్లవి కూడా క్యారెక్టర్ కోసం హోమ్ వర్క్ చేసానంటుంది. ఈ సినిమాలో జోగినిగా కనిపించిన సాయిపల్లవి.. అసలు జోగినిగా ఉండేవాళ్లు ఏం చేస్తారు..? వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది. లాంటి బేసిక్ ఇన్ ఫర్మేషన్ తో పాటు వాళ్ల లైఫ్ స్టైల్ మీద హోమ్ వర్క్ చేశానని చెబుతోంది.