Mass Movies : మెల్లిగా మాస్ కి మారిపోతున్న హీరోలు..

లవ్, రొమాన్స్,ఫ్యామిలీ అండ్ కామెడి జోనర్స్ లో ఎన్ని సినిమాలు చేసి సక్సెస్ అయినా హీరోలకు పెద్ద మార్కెట్ ఉండదు. ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉంటుంది. మాస్ ఇమేజ్ రావాలన్నా, మార్కెట్ పెంచుకోవాలన్నా మాస్ యాక్షన్ సినిమా............

Mass Movies : మెల్లిగా మాస్ కి మారిపోతున్న హీరోలు..

Mass Image

Mass Movies :  లవ్, రొమాన్స్,ఫ్యామిలీ అండ్ కామెడి జోనర్స్ లో ఎన్ని సినిమాలు చేసి సక్సెస్ అయినా హీరోలకు పెద్ద మార్కెట్ ఉండదు. ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉంటుంది. మాస్ ఇమేజ్ రావాలన్నా, మార్కెట్ పెంచుకోవాలన్నా మాస్ యాక్షన్ సినిమా చేసి సక్సెస్ కొట్టాల్సిందే. ఈ విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా మాస్ సినిమాలతో ఎదిగిన వాళ్ళే. ఇప్పుడు మరికొంతమంది హీరోలు ఈ బాట పట్టడానికి రెడీ అవుతున్నారు.

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ కొచ్చిన అఖిల్ ఇప్పటి వరకు హీరోగా చేసింది నాలుగు సినిమాలు అందులో ఒకటే హిట్. అవన్నీ క్లాస్ సినిమాలే. కానీ ఇప్పుడు ఏజెంట్ సినిమాతో తనలోని ఊరమాస్ యాంగిల్ ని రివీల్ చేశాడు అఖిల్. సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి ఏజెంట్ గా అఖిల్ ని నెక్ట్స్ లెవల్ లో చూపించి అక్కినేని అభిమానులకు టీజర్ తోనే మాస్ ట్రీట్ ఇచ్చాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా హిట్ అయితే అఖిల్ కి కచ్చితంగా మాస్ ఇమేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

న్యాచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసి గ్రాండ్ సక్సెస్ లూ కొట్టాడు. కాని ఆయనకు ఇప్పటి వరకూ మాస్ ఇమేజ్ రాలేదు. నాని మంచి నటుడు, లవర్ బాయ్, కామెడి పండిస్తాడు అంటారు కాని, మాస్ హీరో ఇమేజ్ మాత్రం నానికి రాలేదు. దాంతో ఈసారి ఎలాగైనా మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని పూర్తిగా మేకోవర్ మార్చుకుని, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో దసరా సినిమా చేస్తున్నాడు. బొగ్గుగనుల నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో నాని ఊరమాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. దసరా హిట్ అయితే నానికి మాస్ ఇమేజ్ పెరిగే ఛాన్స్ ఉంది.

Vijay Devarakonda : విజయ్-రష్మిక నిజంగానే డేటింగ్ లో ఉన్నారా??

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఇప్పటి వరకు చేసింది మూడే సినిమాలు అందులో ఉప్పెన హిట్ అయితే, కొండపొలం బాక్సాఫీస్ ముందు డిజాస్టర్ గా నిలిచింది. మూడో సినిమా రంగరంగ వైభవంగా ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు నాలుగో సినిమాకే ఏకంగా ఫుల్ మాస్ యాక్షన్ కి టర్న్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కంబైన్డ్ గా నిర్మిస్తున్న సినిమాలో వైష్ణవ్ మాస్ క్యారెక్టర్ తో రాబోతున్నాడు.

సినిమా సినిమాకు ప్రత్యేకతను చాటుకుంటూ తనకంటూ సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మధ్యలో ఒకటి, రెండు యాక్షన్ సినిమాలు చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. శ్రీవిష్ణుకి వచ్చిన హిట్స్ క్లాస్ సినిమాలే. దీంతో లేటెస్ట్ గా ప్రదీప్ వర్మ డైరెక్షన్ లో ఓ మాస్ యాక్షన్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా పేరు అల్లూరి. విప్లవానికి నాంది చైతన్యం… చైతన్యానికి పునాది నిజాయితి.. నిజాయితీకి మారుపేరు అల్లూరి అంటూ వస్తో్న్న ఈ సినిమా శ్రీవిష్ణుకు మాస్ ఇమేజ్ ను ఏమేరకు తీసుకొస్తుందో చూడాలి.

Chaithu-Akhil : అన్న క్లాస్ – తమ్ముడు మాస్.. బ్లాక్ బస్టర్ ఎవరిదో?

ఇదే బాటలో శర్వానంద్, ఆది సాయికుమార్, అల్లరి నరేష్, విజయ్ దేవరకొండ, నిఖిల్, నితిన్… ఇలా యువ హీరోలంతా మాస్ బాట పట్టారు. క్లాస్ సినిమాలతో హిట్స్ కొట్టి హీరోలుగా నిలదొక్కుకున్న వీరంతా మాస్ సినిమాలతో హిట్ కొట్టి స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు. దీంతో రాబోయే తమ సినిమాలని ఫుల్ మాస్ యాక్షన్ సినిమాలుగా సెట్ చేసుకుంటున్నారు.