Ind Vs NZ 3rd T20I : జయహో భారత్.. టీ20 సిరీస్ కూడా మనదే, న్యూజిలాండ్‌పై తిరుగులేని విజయం

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సైతం భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై తిరుగులేని విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.

Ind Vs NZ 3rd T20I : జయహో భారత్.. టీ20 సిరీస్ కూడా మనదే, న్యూజిలాండ్‌పై తిరుగులేని విజయం

Ind Vs NZ 3rd T20I : సొంత గడ్డపై భారత జట్టు చెలరేగిపోతోంది. ఫార్మాట్ ఏదైనా.. విజయాల పరంపర మాత్రం కొనసాగిస్తోంది. తాజాగా టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సైతం భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై తిరుగులేని విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.

235 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి 66 పరుగులకే కుప్పకూలింది. దీంతో 168 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 4 వికెట్లతో చెలరేగాడు. ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, శివమ్ మావి తలో రెండు వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ గిల్ మెరుపు సెంచరీతో భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు.

Also Read..Future of test cricket: టెస్టు క్రికెట్ భ‌విష్య‌త్తుపై ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఆందోళ‌న

అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు నమోదు చేసింది. టీమిండియా యువ సంచలనం శుభ్ మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. పరుగుల వరద పారించాడు. కేవలం 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు శతకం చేశాడు. ఆ తర్వాత 63 బంతుల్లోనే 7 సిక్సర్లు, 12 ఫోర్లతో 126 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన టీ20 కెరీర్ లో తొలి సెంచరీని సాధించాడు.

Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్.. డిశ్చార్జి ఎప్పుడంటే

టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఇషాన్ కిషన్, గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. కేవలం మూడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న ఇషాన్ ఒక పరుగు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి 44 (22 బంతులు, 3 సిక్సర్లు, 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ 24 (13 బంతులు, 2 సిక్సర్లు, 1 ఫోర్), హార్దిక్ పాండ్యా 30 (17 బంతులు, 1 సిక్సర్, 4 ఫోర్లు) పరుగులు సాధించారు. దీపక్ హుడా 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, టిక్నర్, సోధి, మిచెల్ చెరో వికెట్ సాధించారు. బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. టిక్నర్ 3 ఓవర్లలోనే 50 పరుగులు, ఫెర్గుసన్ 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నారు.(Ind Vs NZ 3rd T20I)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ చిన్న వయసులోనే రికార్డులను బద్దలు కొడుతున్నాడు. మూడో టీ20లో న్యూజిలాండ్ పై సెంచరీ చేసిన 23ఏళ్ల ఈ యువ సంచలనం.. అన్ని ఫార్మాట్లలో శతకాన్ని బాదేసి.. అతి తక్కువ వయసులో ఈ ఫీట్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. అలాగే టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ ఇతడే. అంతేకాదు టీ20ల్లో భారత్ తరపున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ భవిష్యత్ ఆశాకిరణంగా మారాడు శుభ్ మన్ గిల్.