Future of test cricket: టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆందోళన
టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ 101 టెస్టు మ్యాచులు, 141 వన్డేలు, 99 టీ20 మ్యాచులు ఆడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ... కొత్తగా అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడుతున్న క్రికెటర్లు అందరూ పొట్టి ఫార్మాట్లపైనే ఆసక్తి చూపుతున్నారని చెప్పాడు. టీ20 లీగ్ లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయని తెలిపాడు.

Future of test cricket: టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ 101 టెస్టు మ్యాచులు, 141 వన్డేలు, 99 టీ20 మ్యాచులు ఆడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ… కొత్తగా అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడుతున్న క్రికెటర్లు అందరూ పొట్టి ఫార్మాట్లపైనే ఆసక్తి చూపుతున్నారని చెప్పాడు. టీ20 లీగ్ లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయని తెలిపాడు.
”నేను ఇటీవలే ఆలివర్ డేవిస్ తో మాట్లాడాను. వైట్ బాల్ క్రికెట్ (లిమిటెడ్ ఓవర్ల మ్యాచులు) నే ఇష్టపడతానని చెప్పాడు. రెడ్ బాల్ క్రికెట్లో (టెస్టుల్లో) అతడిని నేను చూడలేనేమో. అయితే, దీనిపై అతడు దృష్టిసారిస్తే తప్పకుండా ఆడగలడు” అని తెలిపాడు.
”తదుపరి 5-10 ఏళ్లలో క్రికెట్ ఎటు వెళ్తుందో.. ఏం జరుగుతుందోనని నేను కొద్దిగా భయపడుతున్నాను. టెస్టు క్రికెట్లోనూ కుర్రాళ్లు ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే టెస్టు క్రికెట్ ఓ వారసత్వంలా వస్తోంది.. దాన్ని కుర్రాళ్లు వదిలేసి వెళ్లాలని అనుకుంటున్నారు” అని డేవిడ్ వార్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు. కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇప్పటికే టెస్టుల్లో ఆడకుండా టీ20ల్లోనే ఆడుతున్నారు.
Anurag Kashyap : నా స్వార్థం కోసం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయను..