Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్.. డిశ్చార్జి ఎప్పుడంటే

ప్రస్తుతం రిషబ్ పంత్ ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఇప్పటికే సర్జరీలు పూర్తయ్యాయి. ఈ సర్జరీ నుంచి కూడా అతడు వేగంగా కోలుకుంటున్నాడు. తన సర్జరీ పూర్తైందని, కోలుకుంటున్నానని కూడా పంత్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇటీవల వెల్లడించాడు.

Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్.. డిశ్చార్జి ఎప్పుడంటే

Rishabh Pant: గత డిసెంబర్ చివరిలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఇప్పటికే సర్జరీలు పూర్తయ్యాయి.

India U19 team: అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్ విజేతలకు సన్మానం.. ముఖ్య అతిథిగా ఎవరొస్తున్నారంటే

ఈ సర్జరీ నుంచి కూడా అతడు వేగంగా కోలుకుంటున్నాడు. తన సర్జరీ పూర్తైందని, కోలుకుంటున్నానని కూడా పంత్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇటీవల వెల్లడించాడు. తాజా అంచనా ప్రకారం రిషబ్ పంత్ ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత వచ్చే మార్చిలో మరో సర్జరీ నిర్వహించబోతున్నారు. మార్చిలో కుడి మోకాలికి సంబంధించిన శస్త్ర చికిత్స చేస్తారు. అప్పుడే పంత్ ఫిట్‌నెస్‌పై క్లారిటీ వస్తుంది. పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐకి చెందిన వైద్య బృందం నిరంతరం పరిశీలిస్తోందని బీసీసీఐ అధికారులు చెప్పారు.

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపును దోషిగా తేల్చిన కోర్టు.. యావజ్జీవ శిక్ష విధింపు

పంత్ త్వరగా కోలుకుని, మైదానంలోకి అడుగుపెడతాడనే ఆశాభావంతో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పంత్ కోలుకుంటున్నప్పటికీ అతడు కొంతకాలంపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. కనీసం ఆరు నెలలపాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ ఏడాది కీలక టోర్నీలకు పంత్ దూరం కానున్నాడు. రాబోయే ఐపీఎల్‌తోపాటు, అక్టోబర్‌లో జరగబోయే ప్రపంచ కప్‌లో ఆడతాడని కూడా అనుమానమే. పంత్ జట్టులోకి తిరిగి రావడంకంటే కోలుకోవడమే తమకు ముఖ్యమని బీసీసీఐ తెలిపింది.