Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపును దోషిగా తేల్చిన కోర్టు.. యావజ్జీవ శిక్ష విధింపు

ఇప్పటికే ఆశారాం బాపు జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జోధ్‌పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఆశారాం బాపు దోషిగా తేలాడు. దీంతో ఈ కేసులో అతడికి ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపును దోషిగా తేల్చిన కోర్టు.. యావజ్జీవ శిక్ష విధింపు

Asaram Bapu: అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపునకు గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2013లో నమోదైన అత్యాచార కేసులో ఆశారాం బాపును కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. మంగళవారం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ శిక్ష ఖరారు చేసింది.

India U19 team: అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్ విజేతలకు సన్మానం.. ముఖ్య అతిథిగా ఎవరొస్తున్నారంటే

ఇప్పటికే ఆశారాం బాపు జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జోధ్‌పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఆశారాం బాపు దోషిగా తేలాడు. దీంతో ఈ కేసులో అతడికి ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. తాజాగా మరో అత్యాచార ఘటనలోనూ దోషిగా తేలాడు. ఈ కేసుకు సంబంధించి గుజరాత్, మోతెరాలోని ఆశ్రమంలో పని చేస్తున్న సమయంలో తనపై ఆశారాం బాపు అత్యాచారానికి పాల్పడ్డట్లు సూరత్‌కు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2001-2006 వరకు ఆశారాం తనపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

President Droupadi Murmu: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్షాల విమర్శలు.. మోదీ ఎన్నికల ప్రసంగంలా ఉదంటూ కామెంట్

2013లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆశారాంతోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆశారాం బాపును నిందితుడిగా తేల్చింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా మిగతా ఆరుగురిని నిర్దోషులుగా తేల్చింది. వీరిలో ఆశారాం బాపు భార్య, కూతురు కూడా ఉన్నారు. దశాబ్దంపాటు ఈ కేసు విచారణ కొనసాగింది. చివరకు నిందితుడిని దోషిగా తేల్చి, శిక్ష విధించింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో జీవిత కాలపు శిక్ష లేదా పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారని, అయితే, ఇప్పటికే ఇదే తరహా కేసులో కూడా ఆశారాం దోషిగా ఉన్నందున ఆయనకు జీవిత ఖైదు విధించాలని కోరినట్లు బాధితురాలి తరఫు న్యాయవాదులు తెలిపారు.