India vs Spain: హాకీ ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం.. స్పెయిన్‌పై 2–0 గోల్స్‌తో గెలుపు

ఆరంభ మ్యాచ్‌లో శుక్రవారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. 2–0 గోల్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. భారత జట్టు వైస్ కెప్టెన్ అమిత్ రోహి దాస్ తొలి గోల్ కొట్టి భారత గోల్స్ ఖాతా తెరిచాడు.

India vs Spain: హాకీ ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం.. స్పెయిన్‌పై 2–0 గోల్స్‌తో గెలుపు

India vs Spain: హాకీ ప్రపంచ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. టోర్నీని విజయంతో ఆరంభించింది. ఆరంభ మ్యాచ్‌లో శుక్రవారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది.

India: ఆఫ్రికాతో కలిసి మార్చిలో ఇండియా సంయుక్త విన్యాసాలు.. . వెల్లడించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

2–0 గోల్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. భారత జట్టు వైస్ కెప్టెన్ అమిత్ రోహి దాస్ తొలి గోల్ కొట్టి భారత గోల్స్ ఖాతా తెరిచాడు. తర్వాత మరో ఆటగాడు హార్ధిక్ సింగ్ రెండో గోల్ కొట్టాడు. మ్యాచ్ ఆఫ్ టైం ముగిసేసరికి 2 గోల్స్ సాధించగా, స్పెయిన్ ఒక్క గోల్ కూడా చేయలేదు. ఆ తర్వాత ఆట ఆరంభం కాగా, స్పెయిన్‌కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా దూకుడు కొనసాగించి విజయాన్ని అందుకుంది.

Russia: సొలెడార్‌‌ను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా.. తమ ఆధీనంలోనే ఉందన్న యుక్రెయిన్

దీంతో మొదటి మ్యాచ్‌ను ఇండియా విజయంతో ప్రారంభించింది. ఇండియా రెండో మ్యాచ్ ఈ నెల 15న జరుగుతుంది. ఇంగ్లండ్‌తో ఇండియా తలపడాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఇండియా 3 పాయింట్లు సాధించి, అగ్ర స్థానంలో నిలిచింది.