iPhone 14 Discount Offer : కొత్త ఆపిల్ ఫోన్ కావాలా? ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్.. అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండి!

iPhone 14 Discount Offer : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14 Sale) అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

iPhone 14 Discount Offer : కొత్త ఆపిల్ ఫోన్ కావాలా? ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్.. అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండి!

iPhone 14 selling at lowest ever price since launch, check discount offer

iPhone 14 Discount Offer : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14 Sale) అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అంటే.. రూ. 70వేల లోపు ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900గా ఉంది. ఈ డీల్‌ను Apple ప్రముఖ రీ-సెల్లర్, యునికార్న్ స్టోర్ (Unicorn Store)లో ఆఫర్ చేస్తోంది. ఈ iPhone 14 డివైజ్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 డిస్కౌంట్ సేల్ :
యునికార్న్ స్టోర్ అధికారిక వెబ్‌సైట్‌లో 128 GB వేరియంట్ ధర రూ. 69,513కి విక్రయిస్తోంది. మీరు స్టోర్ అందించే క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ (Cash Back Offer)ను పొందవచ్చు. మీరు ధరను మరింత తగ్గించవచ్చు. అప్పుడు మీకు రూ. 4వేల వరకు అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. అయితే, మీరు తప్పనిసరిగా HDFC బ్యాంక్ కార్డ్ కలిగి ఉండాలి. మీ పాత ఫోన్‌ను కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. మీరు హై-ఎండ్ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే.. హై ఎక్స్ఛేంజ్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

iPhone 14 selling at lowest ever price since launch, check discount offer

iPhone 14 Discount Offer : iPhone 14 selling at lowest ever price since launch

Read Also : Hyundai Verna Bookings : హ్యుందాయ్ వెర్నాకు ఫుల్ డిమాండ్.. 10వేలు దాటిన బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా?

మరోవైపు, ఇదివరకే కొనుగోలు చేసిన బడ్జెట్ ఫోన్‌ని వాడుతున్నారా? మరింత తక్కువ ధరకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. యునికార్న్ స్టోర్ వెబ్‌సైట్ కూడా ఫోన్‌ల డెలివరీ ఏప్రిల్ 10 నుంచి మాత్రమే ప్రారంభం కానుంది. ఇతర వేరియంట్‌లపై మాట్లాడితే.. 256 GB వేరియంట్ రూ. 79,112కి, 512 GB వేరియంట్ రూ. 96,712కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 256 GB వేరియంట్ అసలు ధర రూ. 89,900గా ఉంది. 512GB వేరియంట్ అసలు ధర రూ. 1,09,900గా ఉంది.

ఐఫోన్ 14లో ఏది బెటర్ అంటే? :
ఐఫోన్ 14 గతేడాది భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ లైనప్‌లో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max ఉన్నాయి. ఐఫోన్ 14, 2021 ఐఫోన్ 13 మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు ప్రాసెసర్, డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్ వంటి కొన్ని మార్పులతో వచ్చింది. ఐఫోన్ 14 కెమెరా వెనుక కెమెరాలో ఫొటోనిక్ ఇంజిన్‌ను అందిస్తోంది. తక్కువ-కాంతి ఫొటోగ్రఫీ పరంగా కొన్ని మార్పులను కూడా అందిస్తుంది.

సరైన కాంతిలోనూ ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. iPhone 13, iPhone 14తో సమానంగా ఉంటుంది. ప్రస్తుతానికి, iPhone 15 గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో డైనమిక్ ఐలాండ్ నాచ్, సపోర్టింగ్ టైప్-C ఛార్జింగ్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. రాబోయే అన్ని మోడల్‌లు iPhone 15 ఫీచర్ల మాదిరిగానే ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : Infinix Hot 30i Launch : 50MP కెమెరా, భారీ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?