Infinix Hot 30i Launch : 50MP కెమెరా, భారీ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Infinix Hot 30i Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి కొత్త హాట్ 30i ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో అనే పేరుతో లాంచ్ అయింది.

Infinix Hot 30i Launch : 50MP కెమెరా, భారీ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Infinix Hot 30i With 5,000mAh Battery, 50-Megapixel Rear Cameras Launched in India_ Price, Specifications

Infinix Hot 30i Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి కొత్త హాట్ 30i ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో (Infinix Hot 30i) అనే పేరుతో లాంచ్ అయింది. ఈ కొత్త Infinix హాట్ సిరీస్ ఫోన్ 6.6-అంగుళాల Full-HD+ డిస్‌ప్లేతో వస్తుంది. 50-MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

అంతేకాదు.. Infinix Hot 30i 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 30 రోజుల స్టాండ్‌బై టైమ్‌ని అందజేస్తుందని పేర్కొంది. 8GB RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు ఆక్టా-కోర్ MediaTek G37 SoC ద్వారా పవర్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ వచ్చే వారం నుంచి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా భారత మార్కెట్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 30i ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ Hot 30i ఫోన్ సింగిల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999లకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌పై స్పెషల్ లాంచ్ ధర అందిస్తుందా? అనేది రివీల్ చేయలేదు. ఈ ఫోన్ డైమండ్ వైట్, గ్లేసియర్ బ్లూ, మిర్రర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఏప్రిల్ 3 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత మార్కెట్లో సేల్ అందుబాటులో ఉంటుంది.

Read Also : OnePlus Nord CE 3 Lite : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్ అదుర్స్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

ఇన్ఫినిక్స్ Hot 30iపై సేల్ ఆఫర్‌లు Flipkart Axis బ్యాంక్ కార్డ్‌ల ద్వారా డివైజ్ కొనుగోలు చేసే కస్టమర్‌లకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి. ప్రామాణిక EMI ఆప్షన్లతో రూ. 317 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ధరను మరింత తగ్గించాలంటే కస్టమర్‌లు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు.

Infinix Hot 30i With 5,000mAh Battery, 50-Megapixel Rear Cameras Launched in India

Infinix Hot 30i With 5,000mAh Battery, 50-Megapixel Rear Cameras Launched in India

ఇన్ఫినిక్స్ Hot 30i స్పెసిఫికేషన్‌లు :
డ్యూయల్ సిమ్ (నానో)తో ఇన్ఫినిక్స్ Hot 30i ఫోన్ వస్తుంది. Android 12 ఆధారిత XOS 12పై రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6-అంగుళాల Full-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. గరిష్టంగా 500 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ అందించనుంది.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 8GB RAMతో పాటు ఆక్టా-కోర్ 6nm MediaTek Helio G37 SoC ద్వారా పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ మెమరీని వాస్తవంగా 16GB వరకు పొడిగించవచ్చు. ఫొటోలు, వీడియోలకు ఇన్ఫినిక్స్ హాట్ 30i AI-సపోర్టుతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. f/1.6 ఎపర్చర్‌తో 50-MP ప్రధాన సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 5-MP షూటర్ ఉంది. వెనుక కెమెరాతో పాటు సెల్ఫీ సెన్సార్ రెండూ డ్యూయల్-LED ఫ్లాష్ మాడ్యూల్స్‌తో వస్తాయి.

ఇన్ఫినిక్స్ Hot 30i మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా (1TB వరకు) విస్తరించుకోవచ్చు. సపోర్టు ఇచ్చే 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, USB టైప్-C పోర్ట్, బ్లూటూత్, OTG, Wi-Fi ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, జి-సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌తో వస్తుంది.

బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాకింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఇన్ఫినిక్స్ కంపెనీ Infinix Hot 30iలో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 25 గంటల కాలింగ్ సమయాన్ని, 30 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

Read Also : Hyundai Verna Bookings : హ్యుందాయ్ వెర్నాకు ఫుల్ డిమాండ్.. 10వేలు దాటిన బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా?