Hyundai Verna Bookings : హ్యుందాయ్ వెర్నాకు ఫుల్ డిమాండ్.. 10వేలు దాటిన బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా?

Hyundai Verna Bookings : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) నుంచి సరికొత్త మోడల్ 6వ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)ను ప్రవేశపెట్టింది.

Hyundai Verna Bookings : హ్యుందాయ్ వెర్నాకు ఫుల్ డిమాండ్.. 10వేలు దాటిన బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా?

Hyundai Verna closing in on 10,000 bookings, more details here

Hyundai Verna Bookings : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) నుంచి సరికొత్త మోడల్ 6వ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)ను ప్రవేశపెట్టింది. ఈ హ్యుందాయ్ వెర్నా కారు మోడల్ ధర రూ. 10.90 లక్షల నుంచి రూ. 17.38 లక్షల (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. మరో మోడల్ కారు మిడ్-సైజ్ సెడాన్ ధర ప్రకటించే సమయానికి హ్యుందాయ్ వెర్నా దాదాపు 8వేల బుకింగ్‌లను సాధించింది. అయితే, హ్యుందాయ్ వెర్నా 2023 కారు ఇప్పుడు 10వేల బుకింగ్‌లను చేరుకుంది.

హ్యుందాయ్ వెర్నా 2023 మోడల్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని హ్యుందాయ్ సీనియర్ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 13న రూ. 25వేల టోకెన్ మొత్తానికి హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి హ్యుందాయ్ వెర్నా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.

Read Also : Hyundai Ai3 Micro SUV : భారత్‌లో హ్యుందాయ్ Ai3 మైక్రో SUV టెస్టింగ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

హ్యుందాయ్ వెర్నా 2023 నాలుగు వేరియంట్లలో EX, S, SX, SX(O) అందుబాటులో ఉంది. అందులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ MPi పెట్రోల్ (115PS/143.8Nm), 1.5-లీటర్ Turbo GDi పెట్రోల్ (160PS/253Nm) ఉన్నాయి. కారు మూడు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో రానుంది. 6-స్పీడ్ MT, IVT ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT ఆప్షన్లతో వచ్చింది. కొత్త హ్యుందాయ్ వెర్నాలో డార్క్ క్రోమ్ పారామెట్రిక్ గ్రిల్, హారిజోన్ LED పొజిషనింగ్ ల్యాంప్స్, LED DRLలు, పారామెట్రిక్ LED టెయిల్‌ల్యాంప్‌లు, 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Hyundai Verna closing in on 10,000 bookings, more details here

Hyundai Verna Bookings : Hyundai Verna closing in on 10,000 bookings

క్యాబిన్ లోపల, పవర్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, ఇన్ఫోటైన్‌మెంట్, క్లైమేట్ కంట్రోల్ చేయగల డిజిటల్ ప్యానెల్, 10.25-అంగుళాల HD ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్, కలర్ TFT MIDతో కూడిన డిజిటల్ క్లస్టర్, బోస్ ప్రీమియం సౌండ్ 8 స్పీకర్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 64 యాంబియంట్ లైట్ సిస్టమ్ కూడా అందిస్తోంది.

2023 హ్యుందాయ్ వెర్నా ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా 30 భద్రతా ఫీచర్లతో వచ్చింది. మొత్తంమీద, ESC విత్ VSM, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, అన్ని డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, కార్నరింగ్ ల్యాంప్స్, TPMS (హైలైన్)తో సహా 65 భద్రతా ఫీచర్లు ఉన్నాయి. లెవెల్ 2 ADAS తో, హ్యుందాయ్ వెర్నా 2023 పోటీదారులైన హోండా సిటీ 2023 (Honda City 2023), స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్, మారుతి సుజుకి సియాజ్ కన్నా కచ్చితమైన ఎడ్జ్ కలిగి ఉంది. ఈ కారులో 17 లెవల్ 2 ADAS ఫీచర్లు కూడా ఉన్నాయి.

Read Also : OnePlus Nord CE 3 Lite : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్ అదుర్స్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!