Hyundai Ai3 Micro SUV : భారత్‌లో హ్యుందాయ్ Ai3 మైక్రో SUV టెస్టింగ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Hyundai Ai3 Micro SUV : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) నుంచి ఇటీవలే నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)ను లాంచ్ చేసింది.

Hyundai Ai3 Micro SUV : భారత్‌లో హ్యుందాయ్ Ai3 మైక్రో SUV టెస్టింగ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Hyundai Ai3 Micro SUV testing begins in India_ What to expect

Hyundai Ai3 Micro SUV : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) నుంచి ఇటీవలే నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)ను లాంచ్ చేసింది. ఇప్పుడు, కంపెనీ Ai3 Micro SUV కారు మోడల్ లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. Ai3 SUV కారుకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే వివరాలు లీక్ అయ్యాయి.

ఇటీవల ఈ SUV కారును మన భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేశారు. డిజైన్ పరంగా చూస్తే.. మైక్రో SUV డిజైన్ సూచనలను వెన్యూ కాంపాక్ట్ SUV నుంచి తీసుకుంటోంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, బానెట్‌పై స్ట్రాంగ్ లైన్‌లతో హ్యుందాయ్ పారామెట్రిక్ గ్రిల్‌ను అందిస్తుంది. మైక్రో SUV 15-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. చూడటానికి కాస్పర్ మాదిరిగా కనిపిస్తుంది.

Hyundai Ai3 Micro SUV testing begins in India_ What to expect

Hyundai Ai3 Micro SUV testing begins in India

Read Also : Update Aadhaar Card Online : జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు!

వెనుక వైపు చూస్తే.. మైక్రో SUV టెయిల్ ల్యాంప్‌లతో కోణీయ డిజైన్‌ను కలిగి ఉండనుంది. వెనుక స్కఫ్ ప్లేట్‌లను కలిగి ఉంది. Ai3 3.8 మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉంటుంది. 180 mm కన్నా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

కొత్తగా లాంచ్ అయిన గ్రాండ్ i10 నియోస్, (Aura Sedan) సెడాన్‌లకు ఆధారమైన అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్ని ఫీచర్లు, మొదటి సెగ్మెంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కనెక్ట్ చేసిన కార్ టెక్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ Apple CarPlay/Android ఆటో, డిజిటల్ క్లస్టర్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Ai3 SUV కారులో 1.2-లీటర్ VTVT NA పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. వెన్యూ, i20, గ్రాండ్ i10 నియోస్, Auraలోనూ అందిస్తుంది. హ్యుందాయ్ ఇంజిన్‌ను కొద్దిగా ట్యూన్ చేయవచ్చు. ఈ ఇంజన్ 82 bhp శక్తిని, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, గేర్‌బాక్స్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఉంటుంది. Ai3 మారుతి సుజుకి ఇగ్నిస్ , టాటా పంచ్, సిట్రోయెన్ C3 పోటీగా రానుంది.

Read Also : Windows New Update : విండోస్‌లో కొత్త అప్‌డేట్.. స్ర్కీన్‌షాట్ ఎడిటింగ్‌లో బగ్.. ఫిక్స్ చేసిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!