US and Israel Attacks Iran : వణికిస్తున్న వార్.. ఇరాన్ ఐఆర్జీసీ, మిలిటరీ దళాలకు ట్రంప్ ఆఫర్.. ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ ఫోన్ కాల్..
US and Israel Attacks Iran : అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఐఆర్జీసీ, మిలిటరీ దళాలకు ఓ ఆఫర్ ఇచ్చారు.
US and Israel Attacks Iran
- తీవ్రమవుతున్న ఇజ్రాయెల్, ఇరాన్ వార్
- ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తున్న ఇరాన్
- ఇరాన్ ఐఆర్జీసీ, మిలిటరీ దళాలకు ట్రంప్ ఆఫర్
- ఇజ్రాయెల్ ప్రధాని, యూఈఏ అధ్యక్షుడితో మోదీ ఫోన్ సంభాషణ
US and Israel Attacks Iran : అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ పై ‘ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇరాన్ టార్గెట్‌గా ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో మిసైళ్ల వర్షం కురిపింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అతనితోపాటు అతని కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఖమేనీ అనుచరులు, ప్రజలు మరణించారు. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాలపై బాంబుల వర్షం కురిపించింది. రెండో రోజూ కూడా మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
390క్షిపణులు, 830 డ్రోన్లతో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు యూఏఈపై 541 డ్రోన్లు, 165 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. వీటిల్లో 506 డ్రోన్లు, 152 క్షిపణులను కూల్చేసినట్లు యూఏఈ రక్షణశాఖ తెలిపింది. అదేవిధంగా యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్ పై దాడి జరిగినట్లు జరిగినట్లు తెలుస్తోంది. డేటా సెంటర్ లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. కువైట్ పై 97 బాలిస్టిక్ క్షిపణులు, 283 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించగా.. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా.. 30మంది గాయపడ్డారు. బహ్రెయిన్ 45 క్షిపణులు, తొమ్మిది డ్రోన్లను కూల్చేసింది. ఖతార్ పై 100కిపైగా క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది.
ఇరాన్‌కు ట్రంప్ ఆఫర్..
ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఐఆర్జీసీ, మిలిటరీ దళాలకు ఓ ఆఫర్ ఇచ్చారు. ఆయుధాలు వదిలేసిన వారిని ప్రాణాలు వదిలేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఆయుధాలు వదలకపోతే చావు తప్పదంటూ ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుత అవకాశాన్ని వాడుకొని ఇరాన్ ప్రజలు స్వాతంత్ర్యం పొందాలని ట్రంప్ పిలుపునిచ్చారు. యుద్ధం నాలుగు వారాపాటు జరిగే అవకాశం ఉందని ట్రంప్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన మోదీ..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం.. ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించాం అని తమ సంభాషణ గురించి మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ దాడులను ప్రధాని ఖండించారు. యూఏఈకి అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించారు. అలాగే తమ పౌరులను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు షేక్ మహమ్మద్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Burası Filistin değil burası tel Aviv.
İran İsrail’in anasını s…kiyor pic.twitter.com/52FL1kuqdT
— FİKRİ (@Fikri_mce_) March 1, 2026
