Windows New Update : విండోస్‌లో కొత్త అప్‌డేట్.. స్ర్కీన్‌షాట్ ఎడిటింగ్‌లో బగ్.. ఫిక్స్ చేసిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

Windows New Update : ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వీసుల్లో విండోస్ (Windows 10, Windows 11)లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్క్రీన్‌షాట్ సెక్షన్లను రీస్టోర్ చేసేందుకు అనుమతించే లోపాన్ని ఫిక్స్ చేసింది.

Windows New Update : విండోస్‌లో కొత్త అప్‌డేట్.. స్ర్కీన్‌షాట్ ఎడిటింగ్‌లో బగ్.. ఫిక్స్ చేసిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!

Windows New Update _ Microsoft fixes screenshot editing vulnerability on Windows with new update

Windows New Update : ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (MicroSoft) సర్వీసుల్లో విండోస్ (Windows 10, Windows 11)లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్క్రీన్‌షాట్ సెక్షన్లను రీస్టోర్ చేసేందుకు అనుమతించే లోపాన్ని ఫిక్స్ చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ఒక కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది.

నివేదిక ప్రకారం.. ‘acrolips’ గా పిలిచే సెక్యూరిటీ లోపం, స్క్రీన్‌షాట్‌ ఎడిట్ చేసిన భాగాలను రికవర్ చేసేందుకు అనుమతిస్తుంది. తద్వారా వినియోగదారుల పర్సనల్ డేటా బహిర్గతం అవుతుంది. మైక్రోసాఫ్ట్ ప్రకారం.. విండోస్ 10 (Windows 10)లోని స్నిప్ & స్కెచ్ అప్లికేషన్, విండోస్ 11లోని స్నిప్పింగ్ టూల్ (Snipping Tool) రెండూ ఈ బగ్ ద్వారా ప్రభావితమయ్యాయి. స్క్రీన్‌షాట్ తీయడం, సేవ్ చేయడం, ఎడిట్ చేయడంతో పాటు ఒరిజినల్ ఫైల్‌లో మళ్లీ సేవ్ చేసుకోవచ్చు.

Read Also : Redmi A2 Series Launch : 5000mAh బ్యాటరీలతో రెడ్‌మి A2 ప్లస్ సిరీస్ ఫోన్లు.. కళ్లు చెదిరే ఫీచర్లు, ధర ఎంతంటే?

అదే స్నిప్పింగ్ టూల్‌లో మళ్లీ ఓపెన్ చేయడం, ఎడిట్ చేయడం వంటి నిర్దిష్ట స్క్రీన్‌షాట్‌లను మాత్రమే ఈ బగ్ ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. ఈ సెక్యూరిటీ లోపాన్ని సేవ్ చేయడానికి ముందు అప్‌డేట్ చేసిన స్క్రీన్‌షాట్‌లపై లేదా ఈ-మెయిల్‌లు లేదా డాక్యుమెంట్‌ల నుంచి కాపీ చేసి పేస్ట్ చేసిన స్క్రీన్‌షాట్‌లపై కూడా ఎలాంటి ప్రభావం కనిపించలేదు.

Windows New Update _ Microsoft fixes screenshot editing vulnerability on Windows with new update

Windows New Update _ Microsoft fixes screenshot editing vulnerability on Windows

మైక్రోసాఫ్ట్ గత వారంలో ఈ బగ్ సంబంధించి వివరాలను వెల్లడించింది. అంతేకాకుండా, భద్రతా లోపం స్క్రీన్‌షాట్‌ల ఎడిట్ చేసిన భాగాలను రీస్టోర్ చేసేందుకు హ్యాకర్‌లను అనుమతిస్తుంది. ఇమేజ్‌కి చేసిన మార్పులను Undo చేయడానికి హ్యాకర్లకు అనుమతిస్తుంది. తద్వారా వినియోగదారు డిలీట్ చేయాల్సిన వ్యక్తిగత డేటాను బహిర్గతం చేస్తుంది.

హైడ్ చేసిన ఫొటో కట్ చేసిన లేదా ఎడిట్ చేసినట్టు ఉంటుంది. ఎఫెక్ట్ అయిన అప్లికేషన్‌ల కోసం లేటెస్ట్ అప్‌డేట్‌లను పొందాల్సి ఉంటుంది. వినియోగదారులు మైక్రోసాఫ్ట్ స్టోర్‌ని విజిట్ చేసి ‘Library’ తర్వాత ‘Get Updates’పై క్లిక్ చేయవచ్చు. గతంలో, మైక్రోసాఫ్ట్ కూడా అద్భుతమైన కొత్త ఫీచర్లతో Windows 11 అప్‌డేట్‌ను ప్రకటించింది.

టాస్క్‌బార్‌లోని సెర్చ్ ఫంక్షన్ ఇప్పుడు AI- పవర్డ్ బింగ్‌ని కలిగి ఉంటుంది. ఫోన్ లింక్ యాప్ ఐఫోన్ యూజర్లు తమ Windows 11 PCకి కనెక్ట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇంకా, Windows 11 టాస్క్‌బార్, విడ్జెట్‌లు అదనపు ఫీచర్‌లతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. నోట్‌ప్యాడ్ (NotePad) వంటి క్లాసిక్ యాప్‌లు కూడా మల్టీ ట్యాబ్‌లకు సపోర్టు అందిస్తున్నాయి.

Read Also : Update Aadhaar Card Online : జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు!