Redmi A2 Series Launch : 5000mAh బ్యాటరీలతో రెడ్‌మి A2 ప్లస్ సిరీస్ ఫోన్లు.. కళ్లు చెదిరే ఫీచర్లు, ధర ఎంతంటే?

Redmi A2 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి రెండు కొత్త సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ కంపెనీ Redmi A1 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా యూరప్‌లో లాంచ్ అయ్యాయి.

Redmi A2 Series Launch : 5000mAh బ్యాటరీలతో రెడ్‌మి A2 ప్లస్ సిరీస్ ఫోన్లు.. కళ్లు చెదిరే ఫీచర్లు, ధర ఎంతంటే?

Redmi A2, Redmi A2+ With 5,000mAh Batteries, MediaTek Helio G36 SoC Launched_ Specification

Redmi A2 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి రెండు కొత్త సిరీస్ ఫోన్లు (Redmi A2, Redmi A2+) లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ కంపెనీ Redmi A1 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా యూరప్‌లో లాంచ్ అయ్యాయి. MediaTek Helio G36 SoC, 3GB వరకు RAM ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు ఎంట్రీ-లెవల్ హ్యాండ్‌సెట్‌లుగా మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి.

Xiaomi గ్లోబల్ వెబ్‌సైట్‌లో ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. అయితే, హ్యాండ్‌సెట్‌ల ధరకు సంబంధించి వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు ఫోన్లు మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి. Redmi A2 ఫోన్ 8-MP ప్రైమరీ కెమెరా, 5-MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్‌లు 5,000mAh బ్యాటరీ సపోర్టు అందిస్తున్నాయి.

Redmi A2, Redmi A2+ ధర ఎంతంటే? :
కొత్తగా లాంచ్ అయిన Redmi A2, Redmi A2+లు ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లుగా వచ్చాయి. ఈ ఫోన్లు బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. 2GB++32GB, 3GB +32GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ల ధర ఎంత అనేది వివరాలను కంపెనీ ప్రకటించలేదు.

Redmi A2, Redmi A2+ With 5,000mAh Batteries, MediaTek Helio G36 SoC Launched_ Specification

Redmi A2, Redmi A2+ With 5,000mAh Batteries, MediaTek Helio G36 SoC Launched

Read Also : Oukitel WP22 Budget Phone : అతిపెద్ద బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. సింగిల్ ఛార్జ్‌తో 52 రోజులు వస్తుంది.. ధర కేవలం రూ.14వేలు మాత్రమే!

Redmi A2, Redmi A2+ స్పెసిఫికేషన్స్ ఇవే :
రెడ్‌మి Redmi A2, Redmi A2+ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)లో రన్ అవుతాయి. 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.52-అంగుళాల HD+ (1600 x 720 పిక్సెల్స్) LCD స్క్రీన్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. డాట్ డ్రాప్ నాచ్‌తో ఫోన్‌లు 3GB వరకు LPDDR4x RAM, 32GB వరకు eMMC 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వచ్చాయి. MediaTek Helio G36 SoC ద్వారా పవర్ అందిస్తున్నాయి. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. హ్యాండ్‌సెట్‌లు 8-MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు QVGA లెన్స్, వెనుక ప్యానెల్‌లపై LED ఫ్లాష్‌ని కలిగి ఉంటాయి. ముందు భాగంలో 5-MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.

Redmi A2 సిరీస్ ఫోన్‌లలో 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీలు ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే.. డ్యూయల్-సిమ్, 4G, 2.4GHz Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, గ్లోనాస్, గెలీలియో, 3.5mm ఆడియో జాక్, ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్‌కి సపోర్టు అందిస్తాయి. 164.9 × 76.75 × 9.09 మిమీ, బరువు 192 గ్రాములు. Redmi A2+లో Redmi A2 మాదిరిగానే స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేస్తోంది.. రాబోయే 2023 మోడల్‌లో 5 సరికొత్త ఫీచర్లు ఇవే..!