Tollywood Celebrations: ఇట్స్ పార్టీ టైమ్.. సెలబ్రేషన్ మూడ్‌లో టాలీవుడ్!

స్టార్లు షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాలు రిలీజ్ లతో బిజీగా ఉన్నాయి. రిలీజ్ అయిన సినిమాలు.. బ్లక్ బస్టర్లు అవుతూ ఆడియన్స్ తో అంతకన్నా బిజీగా ఉన్నాయి. మరి ఈ సక్సెస్ ని..

Tollywood Celebrations: ఇట్స్ పార్టీ టైమ్.. సెలబ్రేషన్ మూడ్‌లో టాలీవుడ్!

Tollywood Celebrations

Tollywood Celebrations: స్టార్లు షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాలు రిలీజ్ లతో బిజీగా ఉన్నాయి. రిలీజ్ అయిన సినిమాలు.. బ్లక్ బస్టర్లు అవుతూ ఆడియన్స్ తో అంతకన్నా బిజీగా ఉన్నాయి. మరి ఈ సక్సెస్ ని అంతా సెలబ్రేట్ చేసుకునే స్టార్లు ఖాళీ గా ఉంటారా..? వరసగా పార్టీలు చేసుకుంటూ అటు స్టార్లతో పాటు టాలీవుడ్ కూడా ఫుల్ పార్టీ మూడ్ లో ఉంది. మరి ఏ స్టార్లు పార్టీలు చేసుకుంటున్నారో, ఏ సినిమాలు సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Tollywood Drugs Case: మళ్లీ టాలీవుడ్ యాక్టర్ల గుండెల్లో భయం

మొన్న మొన్నటి వరకూ నలుగురూ కలవడానికి భయపటి షూటింగ్స్ కి కూడా దూరంగా ఉన్న టాలీవుడ్.. ఇప్పుడు పార్టీలు చేసుకుంటోంది. స్పెషల్లీ సక్సెస్ సెలబ్రేషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు స్టార్లు. బన్నీ.. పుష్ప గ్రాండ్ సక్సెస్ అవ్వడం తోపాటు.. తనబర్త్ డే కూడా అవ్వడంతో తన టీమ్ మెంబర్స్ తో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ కి పెద్ద పార్టీ ప్లాన్ చేశారు. బన్నీ తాజాగా 40 ప్లస్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు.. పుష్పతో తన పాన్ ఇండియా ఎంట్రీతో పాటు సక్సెస్ రేంజ్ కూడా పెరగడంతో ఈ రెండు అకేషన్స్ ని ఒకే రోజు సెలబ్రేట్ చేసుకున్నారు బన్నీ అండ్ టీమ్.

Tollywood Senior Heroes: ఏజ్ సిక్స్ టీ ప్లస్.. కానీ కుర్ర హీరోలతోనే పోటీ!

లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ కూడా మ్యాసివ్ పార్టీ చేసుకుంది. రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినందుకు ట్రిపుల్ఆర్ బాలీవుడ్ లో గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసింది. బాలీవుడ్ లో ఈసినిమాని తీసుకున్న పెన్ స్టూడియోస్ చాలా గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేట్ చేసింది. రామ్ చరణ్ కూడా ట్రిపుల్ఆర్ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ట్రిపుల్ఆర్ టీమ్ హెడ్స్ అందరినీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇవ్వడంతో పాటు గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చి టీమ్ ఎఫర్ట్ కి థాంక్స్ చెప్పారు.

Tollywood Movies: కుర్ర హీరోలకి కలిసొస్తున్న పెళ్లి కాన్సెప్ట్!

అంతకంటే ముందే దిల్ రాజు నైజాంలో వంద కోట్లు కలెక్ట్ చేసినందుకు టీమ్ అందరికీ గ్రాండ్ గా సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో చరణ్, ఎన్టీఆర్ తో పాటు రాజమౌళి చేసిన రచ్చ మామూలుగా లేదు. అంతేకాదు.. ఇంతే పార్టీలో ట్రిపుల్ఆర్ సెకండ్ పార్ట్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. సెకండ్ పార్ట్ ఉండొచ్చంటూ ఫాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు టీమ్.

Tollywood Stars: హీరోయిన్ల కొరత.. సినిమాలున్నా స్టార్ హీరోల వెయిటింగ్!

అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు.. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు.. కానీ అప్పుడే పార్టీ చేసుకుంటోంది నాని అండ్ కో. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నాని, నజ్రియా జంటగా తెరకెక్కుతున్న ఇంట్రస్టింగ్ మూవీ అంటే సుందరానికి. ఈ క్రేజీ ఎంటర్ టైనర్ కి సంబంధించి లేటెస్ట్ గా పంచె సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ ఇంట్రస్టింగ్ సాంగ్ కి సంబంధించి పంచె కట్టు పార్టీ అరేంజ్ చేసింది టీమ్. టాలీవుడ్ లో నెవర్ బిఫోర్ అన్నట్టు.. పార్టీకి నానితో పాటు టీమ్ మొత్తం పంచె కట్టు తో వచ్చి సందడి చేసింది.

Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

లేటెస్ట్ గా రిలీజ్ అయిన గని సినిమా కూడా ఆడియన్స్ లోకి సినిమా రీచ్ అవ్వడానికి పంచ్ పార్టీ అరేంజ్ చేసింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గని కోసం టీమ్ పడిన ఇన్నాళ్ల కష్టానికి థాంక్స్ గివింగ్ గా పంచ్ పార్టీ గ్రాండ్ గా చేసింది. వరుణ్ తేజ్, హీరోయిన్ సాయిమంజ్రేకర్ తో పాటు గని టీమ్ మొత్తం అటెండ్ అయ్యి హిలేరియస్ గా పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేశారు.