Tollywood Movies: కుర్ర హీరోలకి కలిసొస్తున్న పెళ్లి కాన్సెప్ట్!

సినిమాల్లో ఎక్కడ చూసినా పెళ్లి హడావిడే కనిపిస్తోంది. పెళ్లి కాన్సెప్ట్ లతో తెరకెక్కిన సినిమాలన్నీ ధియేటర్లో సందడి చేస్తూ.. మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అందుకే హీరోలందరూ పెళ్లి..

Tollywood Movies: కుర్ర హీరోలకి కలిసొస్తున్న పెళ్లి కాన్సెప్ట్!

Tollywood Movies

Tollywood Movies: సినిమాల్లో ఎక్కడ చూసినా పెళ్లి హడావిడే కనిపిస్తోంది. పెళ్లి కాన్సెప్ట్ లతో తెరకెక్కిన సినిమాలన్నీ ధియేటర్లో సందడి చేస్తూ.. మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అందుకే హీరోలందరూ పెళ్లి వెంట పడుతున్నారు. ఎంత చూసినా పెళ్లి అవడం లేదు.. నాకు పెళ్లి చెయ్యమని వెంటపడుతున్న స్టార్లు.. చివరికి సినిమాలో పెళ్లితో పాటు మంచి సక్సెస్ కూడా అందుకుంటున్నారు. సినిమా కాన్సెప్ట్ మారుతోంది. రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండేలా, అన్నిరకాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు. అందులోనూ బాగా వర్కవుట్ అవుతున్న పెళ్లి కాన్సెప్ట్ ల మీద హీరోలు బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

Tollywood Stars: హీరోయిన్ల కొరత.. సినిమాలున్నా స్టార్ హీరోల వెయిటింగ్!

లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమా పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కి శర్వాకి డీసెంట్ హిట్ అందించింది. శర్వానంద్ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులతో సఫర్ అవుతున్నారు. వరసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న శర్వా వాటికి బ్రేక్ ఇచ్చిన ఈమధ్య సక్సెస్ అవుతున్న పెళ్లి కాన్సెప్ట్ తో ఆడవాళ్లూ మీకు జోహార్లు మూవీ చేశారు. పెళ్లి చేస్కోడమే మోటోగా.. వరసగా సంబంధాలు చూస్తూ.. రష్మికని పెళ్లి చేస్కోడానికి నానా తంటాలు పడే క్యారెక్టర్ లో శర్వా ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. భారీ స్టార్ కాస్ట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఆడవాళ్లూ మీకు జోహార్లు మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది.

Tollywood Star Heroes: లేట్‌కమర్స్.. ఏళ్లకు ఏళ్ళు కనిపించని స్టార్ హీరోలు!

పెళ్లి కాన్సెప్ట్ తోనే మంచి సక్సెస్ అందుకున్న హీరో నాగశౌర్య. యాక్షన్, లవ్, ఎమోషనల్ ఇలా అన్ని జానర్స్ ట్రై చేస్తున్న నాగశౌర్య.. ఓ అమ్మాయిని ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకునే కాన్సెప్ట్ లో వచ్చిన సినిమా వరుడు కావలెను. రీతూవర్మ హీరోయిన్ గా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పెళ్లి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన వరుడు కావలెను సినిమా నాగశౌర్యకు మంచి సక్సెసే ఇచ్చింది.

Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

పెళ్లి.. పెళ్లి పెళ్ళి అంటూ తెగ హడావిడి చేసిన అఖిల్.. ఆ పెళ్లి కోసం పిల్లని వెతకడం కోసం నానా తంటాలు పడ్డారు. అసలు పెళ్లికి కావల్సిందేంటో క్లారిటీ లేక.. ఆలోచించినా అర్దం కాక తలపట్టుకున్నాడు. ఈ క్రేజీ కాన్సెప్ట్ తో అఖిల్, పూజా జంటగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టైటిల్ తో పెళ్లి కాన్సెప్ట్ చుట్టూ తిరిగిన ఈ సినిమా అటు అఖిల్ కి, పూజాకి మంచి సక్సెస్ అందించడమే కాకుండా ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది.

Tollywood : సిల్వర్ స్క్రీన్‌పై జాతర.. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు

లాస్ట్ ఇయర్ కోవిడ్ టైమ్ లో ఆడియన్స్ ని హిలేరియస్ గా ఎంటర్ టైన్ చేసిన మూవీ రంగ్ దే. నితిన్, కీర్తిసురేష్ జంటగా పెళ్లి బ్యాప్ డ్రాప్ లోనే వచ్చిన లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రంగ్ దే.. నితిన్ కి 2021లో మంచి హిట్ ఇచ్చింది. వరసగా ప్లాపుల తర్వాత రంగ్ దే మూవీ నితిన్ కెరీర్ కి మంచి మైలేజ్ ఇచ్చింది. ఇలా ఈ మధ్య పెళ్లి కాన్సెప్ట్ తో వచ్చిన స్టోరీలన్నీ ఆడియన్స్ కి తెగ నచ్చేస్తున్నాయి.