Tollywood : సిల్వర్ స్క్రీన్‌పై జాతర.. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జాతర జరగడం ఖాయంగా కనిపిస్తుంది. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి...

Tollywood : సిల్వర్ స్క్రీన్‌పై జాతర.. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు

Tollywood

Big Films Release Dates : సిల్వర్ స్క్రీన్‌పై సినిమాల జాతరకు కౌంట్‌డౌన్ మొదలయ్యింది. కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వస్తున్న చిన్న, పెద్ద, పాన్ ఇండియా సినిమాలు..వన్ బై వన్ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ట్రిపుల్‌ ఆర్‌ (RRR) రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయగా.. ఇప్పుడు రాధేశ్యామ్‌ విడుదలపై కూడా స్పష్టత వచ్చింది. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించారు మూవీ మేకర్స్‌. లవ్ అండ్ డెస్టినీ మధ్య జరిగే వార్‌ను మార్చి 11న థియేటర్లలో చూడండి అంటూ.. యూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ట్రిపుల్‌ ఆర్‌ మూవీని మార్చి 25న రిలీజ్‌ చేస్తామని సినిమా టీమ్‌ ఇప్పటికే ప్రకటించగా.. ఇటు భీమ్లా నాయక్‌ ఈ నెల 25 లేదా ఏప్రిల్‌ ఒకటిన విడుదలకు సిద్ధమవుతుండగా.. మెగా మూవీ ఆచార్య ఏప్రిల్‌ 29న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇలా పెద్ద సినిమాలన్నీ సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.

Read More : India Covid Update : దేశంలో కొత్తగా 1,61,386 కోవిడ్ కేసులు నమోదు

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జాతర జరగడం ఖాయంగా కనిపిస్తుంది. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే పెద్ద సినిమాలు, మీడియం బడ్జెట్‌తో తెరకెక్కిన దాదాపు 30కి పైగా సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఆంక్షల సడలింపుతో సినిమా విడుదలకు డేట్లు ప్లాన్‌ చేసుకునే పనిలో ఉన్నారు నిర్మాతలు. మార్చి 11 న ప్రభాస్ రాదే శ్యామ్ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. జనవరి 14న విడుదల కావాల్సిన రాదే శ్యామ్ కరోనా కారణంగా వాయిదా పడింది. దాదాపు 350 కోట్ల రూపాయల బ‌డ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాధే శ్యామ్ పాన్‌ ఇండియాగా రూపొందింది. పరమహంస పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా నిర్మాణం జరిగింది. ఇటు భారీ అంచనాలతో సిద్ధమైన ట్రిపుల్‌ ఆర్‌ కూడా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా విడుదల చేస్తామని మొదటి సారి అనౌన్స్‌ చేసినప్పటి నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. జులై 30, 2020న ట్రిపుల్‌ ఆర్‌ సినిమా రిలీజ్‌ చేస్తామంటూ మొదటిసారి రాజమౌళి ప్రకటించారు. కానీ షూటింగ్‌ ఇబ్బందులతో ఆ డేట్ పోస్ట్ పోన్ అయింది. జూన్‌8, 2021న విడుదల చేస్తామంటూ రెండోసారి ప్రకటించారు. కానీ కరోనా దెబ్బకు ఆ డేట్‌ కూడా మిస్సయ్యింది. తర్వాత అక్టోబర్‌ 12, 2021న రిలీజ్ చేసేస్తామంటూ మూడోసారి ప్రకటించారు. కానీ సెకండ్‌ వేవ్‌తో ఆ తేదీకి కూడా సినిమా రెడీ కాలేదు.

Read More : బాడీలో బుల్లెట్లు దిగినా వెనక్కి తగ్గని కమాండో సందీప్..!

కరోనా కష్టాలను దాటుకుని షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది జనవరి 7న రిలీజ్‌కు RRRను రెడీ చేశారు రాజమౌళి. దానికోసం కొన్ని రోజులుగా భారీగా ప్రమోషన్ చేశారు. కానీ ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌ ఆశలకు ఈ సారి ఒమిక్రాన్‌ వేరియంట్ గండికొట్టింది. దీంతో సినిమా విడుదలను వాయిదా వేసిన టీమ్‌ మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ డేట్స్‌లో కాకుండా మార్చి 25న విడుదల చేస్తామంటూ అనౌన్స్‌ చేసింది. ఇటు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన మోస్ట్ అవేయిటింగ్ మూవీ భీమ్లా నాయక్‌ రెండు రిలీజ్ డేట్లతో ముందుకు వచ్చింది. ఈ నెల 25 లేదా ఏప్రిల్‌ ఒకటి తేదీల్లో ఏదో ఒక రోజు విడుదల చేయనున్నట్లు టీం ప్రకటించింది. ఇవే కాకుండా పెండింగ్‌లో ఉన్న అన్ని సినిమాల రిలీజ్‌పై క్లారిటీ వస్తోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉండగా.. కానీ కరోనా కారణంగా ఏప్రిల్‌ ఫస్ట్‌కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్‌ను కూడా మార్చి ఏప్రిల్‌ 29న రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ మేకర్స్‌ ప్రకటించారు.

Read More : Vijay Devarakonda : మొన్న కస్తూరి.. నిన్న మాళవిక.. సీనియర్ హీరోయిన్స్‌కి తెగ నచ్చేస్తున్న విజయ్ దేవరకొండ

ఇటు మే 12న ప్రిన్స్‌ నటించిన సర్కార్‌ వారి పాట రిలీజ్‌ కానుంది. ముందుగా జనవరి 13న సంక్రాంతి బరిలో నిలవాలని భావించారు. ఆ తర్వాత ఏప్రిల్‌ ఒకటిన రిలీజ్‌ చేస్తామంటూ మైత్రి మూవీ మేకర్స్‌ ప్రకటించారు. కానీ మహేశ్‌బాబుకు కరోనా, కోవిడ్‌ ఆంక్షలతో ఇంకాస్త షూటింగ్‌ మిగిలిపోయింది. వరుసగా సినిమా డేట్స్‌ రిలీజ్‌ అవుతుండటంతో సర్కార్‌ వారి పాట కూడా విడుదలకు సిద్ధమైంది. మే12న ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇంకా నెలరోజులు షూటింగ్‌ మిగిలి ఉన్నట్టు సినిమా యూనిట్‌ ప్రకటించింది. ఫిబ్రవరి చివరి వారం నుంచి లాస్ట్‌ షెడ్యూల్‌ చేసి.. సినిమాను మేలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఇక ఈ నెలలో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 4న షకలక శంకర్ నటించిన ధర్మస్థలితో విడుదల సినిమాల జాతర ప్రారంభం కానుంది. అదే రోజు విశాల్‌ నటించిన సామాన్యుడు.. ఫిబ్రవరి 11న మాస్‌ మహారాజా రవితేజ నటించిన కిలాడి థియేటర్లలో సందడి చేయనుంది. ఫిబ్రవరి 18న నిఖిల్ నటించిన 18 పేజెస్ రిలీజ్ కాబోతుంది. ఇక అదే రోజు బాలీవుడ్‌ సినిమా ఆలియా భట్ నటించిన గంగు భాయ్ కతియవాడి కూడా రిలీజ్ కాబోతుంది.