Tollywood Star Heroes: లేట్‌కమర్స్.. ఏళ్లకు ఏళ్ళు కనిపించని స్టార్ హీరోలు!

బాలీవుడ్ స్టార్లే కాదు.. కనీసం సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసే మన హీరోలు కూడా ఈమధ్య బాగా.. టైమ్ తీసుకుంటున్నారు. దానికి తోడు కోవిడ్ పగబట్టడంతో రిలీజ్ లు ఇంకా లేటవుతున్నాయి.

Tollywood Star Heroes: లేట్‌కమర్స్.. ఏళ్లకు ఏళ్ళు కనిపించని స్టార్ హీరోలు!

Tollywood Star Heroes

Tollywood Star Heroes: బాలీవుడ్ స్టార్లే కాదు.. కనీసం సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసే మన హీరోలు కూడా ఈమధ్య బాగా.. టైమ్ తీసుకుంటున్నారు. దానికి తోడు కోవిడ్ పగబట్టడంతో రిలీజ్ లు ఇంకా లేటవుతున్నాయి. ఇక ప్రభాస్ అయితే లాస్ట్ 9 ఇయర్స్ లో మూడే మూడు సినిమాలు రిలీజ్ చేశారంటే.. ఎంత గ్యాప్ తీసుకుంటున్నారో అర్ధం చేస్కోవచ్చు.

Tollywood Stars: హీరోయిన్ల కొరత.. సినిమాలున్నా స్టార్ హీరోల వెయిటింగ్!

ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు 2019 ఆగస్ట్ లో సాహో సినిమాతో వచ్చారు. సాహో అవ్వకముందే రాధేశ్యామ్ సినిమాను స్టార్ట్ చెయ్యడంతో 2020లోనే రెబల్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ ఈ సినిమా స్టార్ట్ చేసినదగ్గరనుంచి రకరకాల కారణాలతో సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో మూడేళ్ల తర్వాత సినిమా ఫైనల్లీ ఈ మార్చి 11న రిలీజ్ కాబోతోంది.

Tollywood Actress: ముంబైలో తెగ సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అప్పుడెప్పడో 2018లో అరవిందసమేత సినిమా చేశారు. ఆ తర్వాత రాజమౌళితో ట్రిపుల్ ఆర్ కమిట్ అయిన ఎన్టీఆర్.. మధ్యలో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. దాదాపు 4 ఏళ్ల నుంచి ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. లాస్ట్ కి ఎన్నో పోస్ట్ పోన్ ల తర్వాత ట్ ఎన్టీఆర్ ట్రిపుల్ఆర్ మూవీ మార్చి 25న రిలీజ్ కాబోతోంది.

Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 2019 జనవరిలో వినయ విదేయరామ సినిమా రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ రిలీజ్ ఊసే లేదు. రాజమౌళి సినిమా ట్రిపుల్ఆర్ తో బిజీ అవ్వడంతో రామ్ చరణ్ కూడా 3 ఏళ్ల ల్యాంగ్ గ్యాప్ తో ప్రేక్షకులను కలవబోతున్నారు. మార్చిలో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ తో మళ్లీ తెరమీద కనిపించబోతున్నారు.

Tollywood Heroins: ఎవరికి వాళ్ళే హాట్ ట్రెండ్.. ఒక్కొక్కరు ఒక్కోలా దూకుడు!

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కి కూడా హ్యాపెనింగ్ హీరో అయిన విజయ్ దేవరకొండ కూడా 2020లో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత కాస్త కామ్ అయిన విజయ్.. పూరీజగన్ డైరెక్షన్లో లైగర్ సినిమాతో రాబోతున్నాడు. యాక్షన్ ఎంటర టైనర్ గా ఆగస్ట్ 25న రిలీజ్ అవుతోంది లైగర్ మూవీ.

Tollywood Hero’s: కలిసి వస్తున్న తండ్రి కొడుకులు.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఈ సారి బాగా గ్యాప్ తీసుకున్నాడు. 2019లో ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో మంచి హిట్ కొట్టిన వరుణ్.. ఈ సారి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో గని సినిమా చేస్తున్నారు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు ఫాస్ట్ గా చేసే వరుణ్.. ఈ సారి 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ఏప్రిల్ 8న థియేటర్లలోకి రాబోతున్నాడు.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరో చిరంజీవి కూడా ఈ సారి బాగా గ్యాప్ తర్వాతే థియేటర్లలోకి రాబోతున్నారు. 2019లో అక్టోబర్ లో సైరా నర్సింహారెడ్డి ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్.. ప్రస్తుతం ఆచార్య సినిమా రిలీజ్ బిజీలో ఉన్నారు. ఈ సీనియర్ హీరో కూడా 3 ఏళ్ల గ్యా ప్ తీసుకుని మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.