Tollywood Actress: ముంబైలో తెగ సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సౌత్ లో గుర్తింపున్న స్టార్స్ నార్త్ లో, నార్త్ లో గుర్తింపున్న తారలు సౌత్ లో సినిమాలూ చేస్తున్నారు. ఆ సినిమాల ప్రమోషన్ల కోసమో..

Tollywood Actress: ముంబైలో తెగ సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

Tollywood Actress

Tollywood Actress: పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సౌత్ లో గుర్తింపున్న స్టార్స్ నార్త్ లో, నార్త్ లో గుర్తింపున్న తారలు సౌత్ లో సినిమాలూ చేస్తున్నారు. ఆ సినిమాల ప్రమోషన్ల కోసమో, షూటింగ్ షెడ్యూల్స్ కోసమో అక్కడి వాళ్లు ఇక్కడ, ఇక్కడి వాళ్లు అక్కడ చక్కర్లు కొడుతూ తెగ సందడి చేస్తున్నారు. రీసెంట్ గా తెలుగు తారలు ముంబయిలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు.

Movies Leakage: లీకుల బెడద.. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్!

పుష్పతో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకున్న టాలీవుడ్ హీరోయిన్ రష్మిక. ఇప్పుడు అన్ని వుడ్ లకు కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది రష్మిక. రీసెంట్ గా ముంబయిలో ఓ స్టూడియోలో ఫోటో షూట్ చేసి, వెళ్లిపోతుండగా రష్మిక మీడియా కంట పడింది. ప్రస్తుతం రష్మిక మిషన్ మజ్ను, అమితా బచ్చన్ గుడ్ బాయ్ హిందీ మూవీస్ చేస్తోంది.

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

ఈ మధ్య ముంబయిలో సొంత ఇల్లు కట్టుకున్న పూజా హగ్డే, ముంబయి ఎయిర్ పోర్ట్లో ఫామిలీతో కనిపించి హడావిడి చేసింది. పూజా హెగ్డే నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ముంబయిలో హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. డైరెక్ట్ బాలీవుడ్ మూవీ సర్కస్ లో నటిస్తోంది. గని హీరోయిన్ సాయు మంజ్రేకర్ బేసికల్లీ బాలీవుడ్ హీరోయిన్ తెలుగులో మేజర్ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. సాయి మంజ్రేకర్ కూడా ముంబయి ఎయిర్ పోర్ట్ లోనే సందడి చేసి, మీడియా కంట పడింది.

Aishwarya Dharnush: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. వెనక్కు తగ్గారా?

బేసికల్ గా బాలీవుడ్ హీరోయిన్ అయిన రాశిఖన్నా బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ చేసి, టాలీవుడ్ కొచ్చింది. ఇక్కడ సక్సెస్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ముంబయిలో సినిమా ఆఫర్ల్ దక్కించుకుంటుంది. అజయ్ దేవగన్ రుద్ర మూవీలో నటిస్తున్న రాశి ఖన్నా, ఆ సినిమా సెకండ్ ట్రయిలర్ లాంచ్ ఫంక్షన్ లో పాల్గొని, హడావిడి చేసింది.