Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

ఈ మధ్య పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వేరే భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న టాప్ యాక్టర్లు మన తెలుగు హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక్కడి సినిమాలకు..

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

Pan India Movies

Pan India Movies: ఈ మధ్య పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వేరే భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న టాప్ యాక్టర్లు మన తెలుగు హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక్కడి సినిమాలకు వారి ఇండస్ట్రీలో మార్కెట్ స్పాన్ క్రియేట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా అలాంటి పరభాషా ప్రముఖ నటులు మన తెలుగు సినిమాల కోసం క్యూకడుతున్నారు.

Mahesh-Vijay: ఫ్యాన్స్ మధ్య సిల్లీ వార్.. దెబ్బకి నెవెర్ బిఫోర్ రికార్డ్స్!

మన సినిమాను ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ చేసి, అక్కడి ఆడియన్స్ కు రీచ్ చేయాలంటే, అక్కడ గుర్తింపు కలిగిన ఆర్టిస్ట్ లను కీరోల్స్ కు తీసుకోవడం పెద్ద సినిమాలకు కామనే. దాదాపు మిడిల్ రేంజ్ హీరోలు చేస్తున్న సినిమాలు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. త్రిబుల్ ఆర్ లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే, అయితే వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న గని సినిమాలో బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ సునీల్ శెట్టి కీరోల్ చేశాడు.

Aishwarya Dharnush: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. వెనక్కు తగ్గారా?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కోసం బాలీవుడ్ యాక్టర్ జిష్ను సేన్ గుప్తాకు, శౌరవ్ లోకేష్ కన్నడ యాక్టర్ కు ముఖ్య పాత్రలిచ్చారు. లూసీఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ ను ఒప్పించే పని పెట్టుకున్నాడు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కోసం తమిళ స్టార్, డైరెక్టర్ ఎస్ జె సూర్య కీ రోల్ లో నటిస్తున్నాడట.

Acharya: హిందీలో ఆచార్య మెగాస్టార్.. బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు?

పరభాషా నటులను ఎప్పటి నుంచో తన సినిమాల్లో తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కోసం బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కు కీరోల్ ఇస్తున్నాడు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న హాట్రిక్ సినిమా కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఓ స్పెషల్ రోల్ కోసం సెలక్ట్ చేసుకుంటున్నట్టు సమాచారం.