Janhvi Kapoor: సౌత్ నిర్మాతలకు చుక్కలు చూపెడుతున్న జాన్వీ కపూర్.. ఒక్క సినిమా కూడా చేయకుండానే..?

అతిలోకసుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తన తొలి సినిమాతోనే మంచి పేరును సంపాదించుకుంది. ఆ తరువాత చాలా సినిమాల్లోనే నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీకి, అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రావడం లేదు. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Janhvi Kapoor: సౌత్ నిర్మాతలకు చుక్కలు చూపెడుతున్న జాన్వీ కపూర్.. ఒక్క సినిమా కూడా చేయకుండానే..?

Janhvi Kapoor Demands Huge Remuneration From South Producers

Janhvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తన తొలి సినిమాతోనే మంచి పేరును సంపాదించుకుంది. ఆ తరువాత చాలా సినిమాల్లోనే నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీకి, అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రావడం లేదు. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Janhvi Kapoor : నెట్‌ఫ్లిక్స్ నెంబర్ వన్‌గా జాన్వీ కపూర్ మూవీ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న ఎన్టీఆర్ 30 మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకుంటారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు ఆమెను అప్రోచ్ అయ్యిందట చిత్ర యూనిట్. ఇక తనకు సౌత్‌లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది జాన్వీ. ఇప్పుడు ఆయనతో సినిమా ఛాన్స్ రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతుందట. కానీ, రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అమ్మడు నిర్మాతలకు చుక్కలు చూపెడుతుందనే టాక్ వినిపిస్తోంది.

Janhvi kapoor : కనీసం వాళ్ళు చూసినా నా సినిమా హిట్ అయ్యేది..

సౌత్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయకుండా, స్టార్ హీరోయిన్లకు సరిసమానంగా జాన్వీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ప్రొడ్యూసర్లు అవాక్కవుతున్నారట. అటు సినిమాలో తన పాత్రకు సంబంధించి ఎలాంటి కోతలు ఉండకూడదని.. సినిమా స్క్రిప్టును తాను ముందే పూర్తిగా చదవాలని ఆమె డిమాండ్ చేస్తోందట. దీంతో ఒక్క సినిమా కూడా చేయకుండానే ఇంతగా డిమాండ్ ఏంటి అంటూ నిర్మాతలు వేరొక హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట. మరి నిజంగానే జాన్వీ ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందా.. నిజంగానే అమ్మడు నిర్మాతలకు చుక్కలు చూపెడుతుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.