Janhvi Kapoor : నెట్‌ఫ్లిక్స్ నెంబర్ వన్‌గా జాన్వీ కపూర్ మూవీ..

జాన్వీ కపూర్ నటించిన సర్వైవల్ చిత్రం 'మిలి'. మలయాళ సినిమా 'హెలెన్'కి ఇది రీమేక్ గా వచ్చింది. గత ఏడాది నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డా..

Janhvi Kapoor : నెట్‌ఫ్లిక్స్ నెంబర్ వన్‌గా జాన్వీ కపూర్ మూవీ..

Janhvi Kapoor mili movie as Netflix number one

Updated On : January 5, 2023 / 11:12 AM IST

Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా వెండితెరకు పరిచయమైన నటి ‘జాన్వీ కపూర్’. దఢక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతుంది. దీంతో ఈ భామని ఎవరు పట్టించుకోక పోవడంతో గ్లామర్ షో చేస్తూ దర్సకనిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కాగా రీసెంట్ గా జాన్వీ నటించిన చిత్రం ‘మిలి’. మలయాళ సినిమా ‘హెలెన్’కి ఇది రీమేక్ గా వచ్చింది.

Janhvi kapoor : కనీసం వాళ్ళు చూసినా నా సినిమా హిట్ అయ్యేది..

గత ఏడాది నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సర్వైవల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం జాన్వీ చాలా కష్టపడింది. ఎలాగైనా హిట్టు కొట్టాలని రోజులో దాదాపు 10 గంటల పాటు మైనస్ డిగ్రీ ఫ్రీజర్ లో ఉండి నటించింది. అంత కష్టపడినా ఫలితం మాత్రం లభించలేదని బాధపడింది జాన్వీ. అయితే ఇప్పుడు ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డా, ఓటిటిలో మాత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచి ట్రేండింగ్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో జాన్వీ నటన చూసి అందరూ అభినందిస్తున్నారు. దీంతో జాన్వీ కపూర్ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. కాగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కూడా కన్‌ఫార్మ్ అయ్యినట్లు తెలుస్తుంది. NTR30 సినిమాలో ఈ భామని హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.