JioBook Laptop : జియో నుంచి మరో అద్భుతం‌.. స్పెసిఫికేషన్లు ఇవే..!

అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ (జియో ఫోన్ నెక్ట్స్) ను తీసుకొస్తున్నట్టు ప్రకటించి రిలయన్స్ జియో సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది

JioBook Laptop : జియో నుంచి మరో అద్భుతం‌.. స్పెసిఫికేషన్లు ఇవే..!

Jiobook Laptop

JioBook Laptop : అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ (జియో ఫోన్ నెక్ట్స్) ను తీసుకొస్తున్నట్టు ప్రకటించి రిలయన్స్ జియో సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది. స్మార్ట్ ఫోన్ తో పాటు జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ను కూడా ప్రకటిస్తుందని తెలుస్తోంది. భారత మార్కెట్లలోకి జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ను మరి కొద్ది రోజుల్లోనే లాంచ్‌ చేయనుందనే ఊహాగానాలు వస్తున్నాయి.

Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? రీఫండ్ అవుతాయా? ప్రాసెస్ ఇదిగో!

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) వెబ్‌సైట్‌లో సర్టిఫికేషన్‌ కోసం జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ వచ్చినట్లు తెలుస్తోంది. జియో నుంచి రాబోయే ల్యాప్‌టాప్‌ మూడు వేరియంట్లు బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ సైట్‌లో కంపెనీ లిస్ట్‌ చేసింది. కాగా జియో ల్యాప్‌టాప్‌ లాంచ్‌ డేట్‌ మాత్రం కన్ఫర్మ్‌ అవ్వలేదు. జియోబుక్‌ 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీతో వస్తుందని తెలుస్తోంది.

స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌ఎక్స్‌ ర్యామ్‌, 64 జీబీ రామ్‌ స్టోరేజ్‌తో రానుంది. జియోబుక్‌ ధర ఇంకా తెలియాల్సి ఉండగా తక్కువ ధరల్లోనే జియోబుక్‌ ఉంటుందని టెక్‌ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జియోబుక్‌ సర్టిఫికేషన్‌లో భాగంగా మూడు వేరియంట్లతో NB1118QMW, NB1148QMW, NB1112MM బీఐఎస్‌ వెబ్‌సైట్‌లో లిస్ట్ ఐనట్లు టిప్‌స్టార్‌ ముకుల్‌ శర్మ తెలిపారు.

PF Transfer Online : మీ అకౌంట్‌ నుంచి డబ్బులు ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండిలా!

జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్స్( అంచనా)

* స్నాప్‌డ్రాగన్‌ 664 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌
* 4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
* మినీ హెచ్‌డీఎమ్‌ఐ కనెక్టర్‌
* జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ హెచ్‌డీ (1,366×768 పిక్సెల్స్) డిస్‌ప్లే
* డ్యూయల్‌బ్యాండ్‌ వైఫై
* ప్రీ ఇన్‌స్టాల్‌డ్‌ జియో యాప్స్‌
* మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, ఆఫీస్‌
* బ్లూటూత్‌ సపోర్ట్‌