PF Transfer Online : మీ అకౌంట్‌ నుంచి డబ్బులు ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండిలా!

పీఎఫ్ అకౌంట్ దారులకు గుడ్ న్యూస్. మీ అకౌంట్ నుంచి ఈజీగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.. ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలు.. మీ అకౌంట్లోని అమౌంట్ సులభంగా ట్రాన్స్ ఫర్ అయిపోతుంది.

PF Transfer Online : మీ అకౌంట్‌ నుంచి డబ్బులు ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండిలా!

Pf Transfer Online Procedure For Epf Transfer Through Epfo Portal

PF Transfer Online : పీఎఫ్ అకౌంట్ దారులకు గుడ్ న్యూస్. మీ పీఎఫ్ అకౌంట్ నుంచి ఈజీగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.. ఈపీఎఫ్‌వో అకౌంట్ దారుల కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులను సులభంగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. సాధారణంగా ఏ ఉద్యోగి అయిన తాను పనిచేసే సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు పీఎఫ్ అకౌంట్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.

దీని కారణంగా పాత పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను విత్ డ్రా చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పుడా ఆ సమస్యకు కేంద్రం పరిష్కారం చూపుతూ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్రం ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలు.. మీ అకౌంట్లోని డబ్బులను సులభంగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
Encryption Key : వాట్సాప్ యూజర్లు.. మీ చాట్ బ్యాకప్ ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు!

మీరు ముందుగా చేయాల్సిందిల్లా ఒక్కటే.. మీ EPFO అకౌంట్ పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలంటే తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించాలి. అందులో ప్రధానంగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్.. పీఎఫ్ అకౌంట్ కోసం ఇచ్చిన ఫోన్ నెంబర్ యాక్టివ్ గా ఉండాలి. అంటే.. పనిచేస్తుండాలి.

అలాగే అకౌంట్ దారు పాత లేదా ప్రస్తుత కంపెనీ EPFO అకౌంట్లో డిజిటల్ రిజిస్టర్డ్ సిగ్నేచర్లు ఉండాలి. చివరిగా మీరు అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్ కూడా పీఎఫ్ అకౌంటులో కేవైసీ కూడా సరిగా ఉండాలి. ఇవన్నీ కరెక్టుగా ఉంటేనే మీ పీఎఫ్ అమౌంట్ ఈజీగా ట్రాన్స్ ఫర్ చేసుకోవడం వీలువుతుంది.

ట్రాన్స్‌ఫర్‌ ప్రాసెస్ ఇదిగో :
పీఎఫ్ అధికారిక వెబ్ సైట్.. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌ సైట్‌ విజిట్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ UAN ‌(Universal Account Number), అలాగే దాని పాస్‌వర్డ్‌ను టైప్‌ చేయండి.. ఆ తర్వాత ఎంటర్‌ బటన్‌ క్లిక్‌ చేయండి.
మీరు క్లిక్‌ చేయగానే ఆన్‌ లైన్‌ సర్వీస్‌ ఆప్షన్‌ డిస్ ప్లే అవుతుంది. దానిపై క్లిక్‌ చేయండి. ‘One Member-One EPF అకౌంట్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్ట్‌ పెట్టాలి.
ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్‌ తర్వాత Get Details ఆప్షన్‌‌పై Tap చేయండి.
Get Details ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే మీరు పాత సంస్థ epfo వివరాలు డిస్‌‌ప్లే అవుతాయి.
ట్రాన్స్‌‌ఫర్‌ వెరిఫికేషన్ అప్లికేషన్ కోసం పాత సంస్థ లేదా ప్రస్తుత సంస్థ ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఆ తర్వాత UAN రిజిస్ట్రర్డ్‌ మొబైల్‌ నెంబర్‌‌కు OTP వస్తుంది.
మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన OTP ఎంటర్‌ చేసి సబ‍్మిట్‌ బటన్‌‌పై క్లిక్‌ చేయండి.
ఇలా క్లిక్‌ చేసిన వెంటనే.. మీ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ వెరిఫికేషన్‌ అవుతుంది.
ఆ తర్వాత కొత్త పీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది.
Delhi HC : ఆధార్ సంఖ్యను మార్చవచ్చా ? కుదరదన్న UIDAI