Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? రీఫండ్ అవుతాయా? ప్రాసెస్ ఇదిగో!

మీ డబ్బులు మరో అకౌంట్లోకి పొరపాటున ట్రాన్స్‌ఫర్ చేశారా? కంగారు పడకండి. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు.. రీఫండ్ కావడం చాలా ప్రాసెస్ ఉంటుంది. మీ డబ్బులు తిరిగి రావాలంటే ఇలా చేయండి.

Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? రీఫండ్ అవుతాయా? ప్రాసెస్ ఇదిగో!

Transferred Money To A Wrong Account

Transferred Money to a Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి పొరపాటున ట్రాన్స్‌ఫర్ చేశారా? కంగారు పడకండి. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు.. రీఫండ్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అప్పుడే మీ డబ్బులు తిరిగి మీ అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా డిజిట‌ల్ లావాదేవీలకు సంబంధించి ప‌టిష్ఠ‌మైన భ‌ద్ర‌త‌ను అందిస్తోంది. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, వాలెట్స్‌, యూపీఐ.. అనేక ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. డ‌బ్బుల‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. కొన్నిసార్లు పొర‌పాటుగా రాంగ్ అకౌంట్‌కు డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తుంటారు. అకౌంట్ నెంబ‌ర్ సరిగా ఇవ్వకపోవడం లేదా త‌ప్పుడు అకౌంట్ ఇవ్వ‌డం, IFSC Code త‌ప్పుగా ఇవ్వడం వంటి కారణాల వల్ల మీ డబ్బులు రాంగ్ అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ అయిపోతాయి.

అలా డబ్బులు మరో అకౌంట్లోకి వెళ్తే ఏం చేయాలో చాలామందికి తెలియదు. హైరానా పడిపోతుంటారు. బ్యాంకుల ద‌గ్గ‌రికి వెళ్లి లబోదిబోమంటుంటారు. రాంగ్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ ఫర్ కాగానే మీరు మీ అకౌంట్ బ్రాంచ్ బ్యాంకులో ఫిర్యాదు చేయండి. సంబంధిత బ్యాంకు సమాచారం ఇవ్వడం ద్వారా మీ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేయాలి. ట్రాన్సాక్ష‌న్ చేసిన తేదీ, టైమ్‌, అన్ని వివరాల‌ను చెప్పాలి. మెయిల్ చేయమంటారు. మీరు పంపే మెయిల్‌లో కూడా లావాదేవీకి సంబంధించిన అన్ని వివ‌రాల‌ను పంపాలి. డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ అయితే అకౌంట్ నెంబ‌ర్‌తో అన్ని వివ‌రాల‌ను మెయిల్ చేయాల్సి ఉంటుంది.
Big Boss 5: సరయు తొలివారమే ఎలిమినేషన్.. అభిమానులు కోరుకున్నదేనా?

రాంగ్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తే :
అకౌంట్ నంబర్ తప్పుగా ఎంటర్ చేస్తే.. ఆ డబ్బులు ఇన్ వాలిడ్ అకౌంట్లోకి వెళ్తాయి. అంటే.. మీ డబ్బులు ఏ అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ కావు. కానీ, మీ ఖాతాలో డబ్బులు డెబిట్ అవుతాయి. వెంటనే తిరి డబ్బులు మీ అకౌంట్లోకి రీఫండ్ అవుతాయి. మీ డబ్బులు రీఫండ్ కాని పక్షంలో వెంట‌నే హోమ్ బ్రాంచ్‌ను సంప్రదించాలి. బ్యాంకు మేనేజ‌ర్‌కు వివ‌రాలు చెప్పాలి. మేనేజర్ వెంట‌నే మీ ఫండ్స్‌ను ఇనిషియేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

అదే యాక్టివ్ అకౌంట్లోకి వెళ్తే :
మరోకరి యాక్టివ్ అకౌంట్లోకి మీ డబ్బులు ట్రాన్స్ ఫర్ అయితే.. కొంత సమయం పడుతుంది. కొన్నిసార్లు నెల‌లు కూడా పట్టొచ్చు. ఏ అకౌంట్‌కు, బ్యాంక్ బ్రాంచ్‌కు డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయో తెలుసుకోవాలి. అది మీ బ్యాంకులోనే తెలుసుకోవ‌చ్చు. కంప్లయింట్ చేశాక.. మీ డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన ఖాతాదారుడి అనుమతి కోరుతుంది. అనంతరం డబ్బుల‌ను మీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తుంది.

అకౌంట్ హోల్డర్ నో అంటే :
బ్యాంకు ఖాతాదారుల్లో తమ అకౌంట్లోకి వచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించరు. అప్పుడు వారిపై కేసు నమోదు చేయొచ్చు. ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ను పాటించాలి. బెనిఫిషియ‌రీ అకౌంట్ స‌రైన వివ‌రాలు ఇవ్వాల్సి ఉంటుంది. డ‌బ్బులు పంపే క‌స్ట‌మ‌ర్.. రాంగ్ అకౌంట్‌కు డ‌బ్బులు పంపితే .. అందుకు బ్యాంకు బాధ్య‌త వ‌హించ‌దని గుర్తించాలి. బాధితుడి మద్దతుగా మనీ ట్రాన్స్‌ఫ‌ర్ అయిన వ్య‌క్తికి రిక్వెస్ట్ మాత్రమే పంపిస్తుంది. అలా ఒప్పుకోక‌పోతే.. లీగ‌ల్‌గా ప్రొసీడ్ కావొచ్చు.

రాంగ్ అకౌంట్లకు డ‌బ్బులు ట్రాన్స్ ఫర్ అవుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కొన్ని కీల‌క నిర్ణ‌యాలను వెల్లడించింది. ఎవ‌రికైనా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేయగానే.. ఆర్బీఐ నుంచి మెసేజ్ వస్తుంది. ట్రాన్సాక్ష‌న్‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా? అని.. ఒకవేళ రాంగ్ అకౌంట్‌లో డ‌బ్బులు వేస్తే.. ఈ నెంబ‌ర్‌కు మెసేజ్ పంపించాలంటూ మెసేజ్‌ను ఆర్బీఐ పంపిస్తోంది. ఈ ట్రాన్సాక్ష‌న్లకు సంబంధించి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్బీఐ బ్యాంకులకు రూల్స్ పాస్ చేసింది. వెంట‌నే చర్యలు తీసుకుని స‌రైన అకౌంట్‌కు డ‌బ్బులు రీఫండ్ అయ్యేలా చూడాలని ఆర్బీఐ సూచించింది. పొర‌పాటున రాంగ్ అకౌంట్‌కు డ‌బ్బులు పంపినా ఆందోళన చెందకండి.. మీ డబ్బులు భద్రంగానే ఉన్నాయి.. మీ హోం బ్రాంచ్ కు వెళ్లి సమాచారం ఇవ్వండి.. సరైన వివరాలను అందించండి.. బ్యాంకు వాళ్లే చర్యలు తీసుకుని మీ డబ్బులను తిరిగి రీఫండ్ చేస్తారు.
Big Boss 5: హౌస్ నుండి బయటికెళ్ళాక శివాలెత్తిన సరయు..!