RRR Movie : యంగ్ టైగర్‌ ఎనర్జిటిక్ సాంగ్!

జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన సినిమా కోసం ఓ సాలిడ్ సాంగ్ పాడబోతున్నాడట..

RRR Movie : యంగ్ టైగర్‌ ఎనర్జిటిక్ సాంగ్!

Jr Ntr Sung A Song

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ – రౌద్రం రణం రుధిరం..

Balakrishna – Jr NTR : నందమూరి ఫ్యాన్స్‌‌కి గుడ్‌న్యూస్.. త్వరలో ఒకే వేదికపై బాబాయ్-అబ్బాయ్..

దర్శకధీరుడు రామమౌళి దర్శకత్వంలో.. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన క్యారెక్టర్ల తాలుకు పోస్టర్లు, చరణ్, తారక్ టీజర్లకు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ‘నాటు నాటు’ పాట నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయ్యింది.

Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..

ఈ సినిమా గురించి వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటంటే.. తారక్ ఓ పాట పాడాడట. ఇంతకుముందు ‘యమదొంగ’, ‘కంత్రీ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకుప్రేమతో’ పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ సినిమా ‘చక్రవ్యూహా’ సినిమాల్లో తారక్ పాడిన పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో జక్కన్న, కీరవాణి కలిసి ‘ఆర్ఆర్ఆర్’ లో యంగ్ టైగర్‌తో ఓ ఎనర్జిటిక్ సాంగ్ పాడించారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..