Sarkaru Vaari Paata: కళావతి @ 150 మిలియన్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను...

Sarkaru Vaari Paata: కళావతి @ 150 మిలియన్

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. అంతేగాక ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ వీడియో అండ్ సాంగ్స్ అంచనాలను రెట్టింపు చేశాయి.

Sarkaru Vaari Paata: టైటిల్ సాంగ్‌తో పైసా వసూల్ చేస్తున్న మహేష్!

అయితే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘కళావతి’ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ పాటలో మహేష్ సరికొత్త స్టెప్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అటు పాట కూడా సరికొత్తగా ఉండటంతో ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము లేపింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. తాజాగా ఈ పాట యూట్యూబ్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా 150 మిలియన్ వ్యూస్ సాధించి, కళావతి సాంగ్ దుమ్ములేపింది.

Sarkaru Vaari Paata: షూటింగ్‌కు సీల్ వేసిన మహేష్!

తెలుగులో అత్యంత వేగంగా 150 మిలియన్ వ్యూస్ సాధించిన వీడియో సాంగ్ గా కళావతి సెన్సేషన్ క్రియేట్ చేసింది. థమన్ అద్భుతమైన సంగీతంతో ఈ పాట మరో లెవెల్ కు శెల్లింది. ఇక ఈ సినిమాకే హైలైట్ గా కళావతి పాట ఉండనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తి బ్యాంకింగ్ నేరాల బ్యాక్ డ్రాప్ తో రాబోతున్నట్లు ఇఫ్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండటంతో మహేష్-కీర్తి సురేష్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. వేసవి కానుకగా ఈ సినిమాను మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.