Sarkaru Vaari Paata: టైటిల్ సాంగ్‌తో పైసా వసూల్ చేస్తున్న మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది....

Sarkaru Vaari Paata: టైటిల్ సాంగ్‌తో పైసా వసూల్ చేస్తున్న మహేష్!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సర్కారు వారి పాట లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ ఇవాళ రిలీజ్ చేస్తుందని ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. ఇక థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్‌పై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Sarkaru Vaari Paata: షూటింగ్‌కు సీల్ వేసిన మహేష్!

సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ మహేష్ క్రేజ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేలా జోష్‌ఫుల్‌గా ఉండటంతో ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. వింటేజ్ మాస్ వైబ్స్‌తో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. హారికా నారాయణ్ పాడిన ఈ మాస్ సాంగ్‌కు అనంత శ్రీరామ్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఇక సూపర్ ఫాంలో ఉన్న థమన్ మరోసారి ఈ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. కాగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Sarkaru Vaari Paata: మరో రెండు రోజుల్లో సర్కారు వారి పాట ఖతం!

ఇక సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ విన్న అభిమానులు ఈ పాటతోనే బాక్సాఫీస్ వద్ద పైసా వసూల్ చేసేందుకు మహేష్ రెడీ అయ్యాడనే హింట్ ఇచ్చాడని.. ఈ సినిమాతో బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను రికవరీ చేయడం ఖాయమని అంటున్నారు. మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ మూవీగా తీర్చిదిద్దినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.