Sarkaru Vaari Paata: షూటింగ్‌కు సీల్ వేసిన మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్...

Sarkaru Vaari Paata: షూటింగ్‌కు సీల్ వేసిన మహేష్!

Sarkaru Vaari Paata Wraps Up Shooting

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ చిత్రంపై అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేయగా, ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.

Sarkaru Vaari Paata: మరో రెండు రోజుల్లో సర్కారు వారి పాట ఖతం!

సమ్మర్ ట్రీట్‌గా రాబోతున్న ఈ సినిమాను మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ముగించుకున్నారు చిత్ర యూనిట్. ఓ మాస్ సాంగ్‌తో ఈ సినిమా షూట్ పూర్తవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. గత రెండు రోజులుగా, మహేష్ ఈ సాంగ్ షూట్‌లో పాల్గొన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా కోసం మరోసారి బెస్ట్ ట్యూన్స్‌ను కంపోజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ కొత్త పోస్టర్‌తో ప్రకటించింది.

Sarkaru Vaari Paata: సర్కారు పోస్ట్‌పోన్ రూమర్స్.. మాట తప్పేది లేదన్న మేకర్స్!

ఈ పోస్టర్‌లో మహేష్ తాళాల గుత్తి పట్టుకుని సీల్ వేసినట్లుగా కనిపిస్తున్నాడు. యాక్షన్ మోడ్‌లో ఉన్న మహేష్ లుక్ సరికొత్తగా ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చిత్ర యూనిట్ ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఈ సినిమాలోని టైటిల్ ట్రాక్ సాంగ్‌ను ఇవాళ ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తుండటంతో అందరి చూపు ఇప్పుడు ఈ పాటపై ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన కళావతి, పెన్నీ సాంగ్స్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో, సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.