Sreeleela: బాగా పెంచేసిన కన్నడ బ్యూటీ.. సినిమాకి కోటి డిమాండ్?

స్టార్ హీరోల సినిమాల్లో ఓ యంగ్ హీరోయిన్ పేరు బాగా చక్కర్లు కొడుతుంది. ఒక్క సినిమాతో గ్లామర్ ముద్ర వేయించుకుని సందడి షురూ చేసిన ఈ కన్నడ కస్తూరి శ్రీలీల.. ఇప్పటికే కొన్ని..

Sreeleela: బాగా పెంచేసిన కన్నడ బ్యూటీ.. సినిమాకి కోటి డిమాండ్?

Sreeleela

Sreeleela: స్టార్ హీరోల సినిమాల్లో ఓ యంగ్ హీరోయిన్ పేరు బాగా చక్కర్లు కొడుతుంది. ఒక్క సినిమాతో గ్లామర్ ముద్ర వేయించుకుని సందడి షురూ చేసిన ఈ కన్నడ కస్తూరి శ్రీలీల.. ఇప్పటికే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలకు సైన్ కూడా చేసింది. పెళ్లి సందడి సినిమాతో గ్లామర్ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కన్నడ సోయగం.. ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకుని వరుసగా సినిమాలకు సైన్ చేస్తుంది. అయితే అన్నింటికి మించి అన్న రేంజ్ లో ప్రభాస్, మహేశ్, బాలకృష్ణ సినిమాల్లో కూడా అమ్మడి పేరు వినిపిస్తుంది.

Sreeleela: క్రేజీ ఆఫర్లు.. కన్నడ బ్యూటీకి మరో జాక్‌పాట్!

శ్రీలీల ప్రస్తుతం ధమాకా మూవీలో రవితేజ సరసన నటిస్తోంది. అయితే రీసెంట్ గా ప్రభాస్, మహేశ్ బాబు, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాల్లో శ్రీలీల ఛాన్స్ కొట్టేసిందంటూ ప్రచారం ఫుల్ గా ఊపందుకుంది. నవీన్ పొలిశెట్టి న్యూ ఫిల్మ్ అనగనగా ఒక రాజు సినిమాకి డేట్స్ ఇచ్చేసిన శ్రీలీల.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కూడా జోడి కడుతోందని ప్రచారం సాగుతోంది. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ నటించే చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్ అని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

Sreeleela: లక్కీ గర్ల్ శ్రీలీల.. రెబల్ స్టార్‌తో జతకట్టే ఛాన్స్?

తొలి సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోయినా ఒడ్డూ పొడుగున్న ఈ భామ ఇండస్ట్రీని ఆకట్టుకోవడంలో మాత్రం బాగానే సక్సెస్ అయింది. అందుకే వరసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇక ఆఫర్లు ఉన్నప్పుడే కాస్త వెనకేసుకోవాలని భావించిందో ఏమో కానీ.. రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేసిందట. ఓ మోస్తరు హీరోలకు హీరోయిన్ల కొరత వేధిస్తున్న టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా పేరు వినిపిస్తుండడంతో ఏకంగా సినిమాకి రూ.కోటి డిమాండ్ చేస్తుందట. తమ హీరోలతో జోడీ బాగుంటుందనే కారణంతో నిర్మాతలు కూడా రూ.కోటికి ఒకే అంటున్నారట.