Varisu: వారిసు సినిమాలో ఆ హీరోయిన్‌ను లేపేశారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాను కేవలం తమిళంలోనే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సంక్రాంతి సీజన్ కావడంతో, తెలుగులో స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో.. వారిసు తెలుగు డబ్బింగ్ సినిమాను ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Varisu: వారిసు సినిమాలో ఆ హీరోయిన్‌ను లేపేశారా..?

Khushboo Portion Removed From Varisu

Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాను కేవలం తమిళంలోనే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సంక్రాంతి సీజన్ కావడంతో, తెలుగులో స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో.. వారిసు తెలుగు డబ్బింగ్ సినిమాను ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Varisu: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న వారిసు

ఇక వారిసు సినిమాను చూసిన వారు ఒక అంశంలో తీవ్ర నిరాశకు లోనవుతున్నట్లుగా తెలుస్తోంది. ఓ సీనియర్ హీరోయిన్ పాత్రకు సంబంధించిన పోర్షన్‌ను సినిమా ఎడిటింగ్‌లో పూర్తిగా లేపేసినట్లుగా తెలుస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర షూటింగ్ సమయంలో మనకు ఆమె విజువల్స్ కనిపించాయి. అయితే ఇప్పుడు వారిసు సినిమా రిలీజ్ తరువాత, సినిమాలో ఆమె ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ సినిమాలో ఖుష్బూ పాత్ర ఏమిటా.. ఆమె పాత్రను ఎందుకు లేపేశారా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

Varisu: తన సినిమా ప్రీమియర్ చూడబోతున్న విజయ్!

ఏదేమైనా ఓ ఇమేజ్ ఉన్న హీరోయిన్ పాత్రను ఎడిటింగ్‌లో పూర్తిగా లేపేయడం ఏమాత్రం పద్ధతి కాదని క్రిటిక్స్ అంటున్నారు. మరి ఖుష్బూ పాత్రను చిత్ర యూనిట్ ఎందుకు తీసేశారో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.