Varisu: తన సినిమా ప్రీమియర్ చూడబోతున్న విజయ్!

తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాపై చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉండటంతోనే ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో జనవరి 11న రిలీజ్ చేయాలని దిల్ రాజు పూర్తి ప్రయత్నాలు చేశాడు.

Varisu: తన సినిమా ప్రీమియర్ చూడబోతున్న విజయ్!

Vijay To Watch The Premiere Of Varisu Today

Varisu: తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాపై చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉండటంతోనే ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో జనవరి 11న రిలీజ్ చేయాలని దిల్ రాజు పూర్తి ప్రయత్నాలు చేశాడు.

Varisu Trailer: వారిసు ట్రైలర్.. క్లాస్‌కు మాస్ యాక్షన్‌ను జోడించిన విజయ్!

కానీ, తెలుగు బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వస్తుండటంతో వారిసు చిత్రాన్ని తెలుగులో జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక తమిళంలో మాత్రం వారిసు చిత్రాన్ని ముందుగా అనుకున్నట్లుగానే జనవరి 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఇక ఈ నేపథ్యంలో నేడు(జనవరి 9) వారిసు చిత్రాన్ని అక్కడ పలువురు సెలెబ్రిటీల కోసం ప్రీమియర్ షోను వేయనున్నారు.

Vijay : విజయ్ సినిమాలో విలన్‌ అతనే.. కన్‌ఫార్మ్ చేసిన లోకేష్ కనగరాజ్!

అయితే ఈ ప్రీమియర్ షోను హీరో విజయ్ కూడా వీక్షించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, అందాల భామ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రీమియర్ షోలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి అంటున్నారు అభిమానులు.