Koratala Shiva : కాజల్ ని ఆచార్య సినిమాలోంచి తీసేశాం.. ఎందుకంటే??

కొరటాల శివ మాట్లాడుతూ.. ''సినిమా అనుకున్నప్పుడు హీరోకి జోడీగా హీరోయిన్‌ ఉంటే బాగుండు అనుకోని ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్‌ పాత్ర క్రియేట్‌ చేశాం. కానీ ‘ఆచార్య’ పాత్రకు..........

Koratala Shiva : కాజల్ ని ఆచార్య సినిమాలోంచి తీసేశాం.. ఎందుకంటే??

Kajal

Koratala Shiva :  చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా రిలీజ్ కి నాలుగు రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించారని గతంలో చిత్ర యూనిట్ అధికారికంగానే ప్రకటించారు. అయితే ఆచార్య టీం కాజల్ ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం ఆమె పేరు కూడా ఎందుకు ఎత్తట్లేదు అని అంతా ఆలోచిస్తున్నారు.

సినిమా షూటింగ్ మొదలైనప్పుడు కాజల్ తన భర్తతో సెట్ కి వస్తే వారిద్దర్నీ చిరంజీవి, చిత్ర యూనిట్ సన్మానించారు కూడా. రెండేండ్ల క్రితం గౌత‌మ్ కిచ్లూను పెండ్లి చేసుకున్న కాజ‌ల్ ఇటీవలే ఓ మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్రెగ్నెన్సీ కారణంగా, బాబు పుట్టిన కారణంగా ఆమె ప్రమోషన్ కార్యక్రమాలకి దూరంగా ఉంది అని అంతా భావిస్తున్నారు. అయితే కాజల్ గురించి చిత్ర యూనిట్ ఎక్కడా ప్రస్తావించట్లేదు. గతంలో ‘ఆచార్య’ షూట్‌లో కాజల్‌ పాల్గొన్న ఫొటోలు బయటకి వచ్చాయి. అంతేకాక ‘లాహే లాహే’ సాంగ్‌లో సంగీతతో కలిసి కాజల్‌ డ్యాన్స్‌ చేసినట్టు కూడా చూపించారు, కానీ ఇటీవల వచ్చిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ లో ఎక్కడా కాజల్ కనిపించలేదు. దీంతో కాజల్ అభిమానులు ఈ సినిమాలో అసలు కాజల్ ఉందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?? అందరికి చెప్పేసిన స్నేహరెడ్డి..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై అడగగా డైరెక్టర్ కొరటాల శివ సమాధానమిచ్చారు. కొరటాల శివ మాట్లాడుతూ.. ”సినిమా అనుకున్నప్పుడు హీరోకి జోడీగా హీరోయిన్‌ ఉంటే బాగుండు అనుకోని ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్‌ పాత్ర క్రియేట్‌ చేశాం. నాలుగు రోజులు షూట్‌ కూడా చేశాం. కానీ ‘ఆచార్య’ పాత్రకు లవ్‌ ఎమోషన్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే విషయంపై నాకు డౌట్ వచ్చింది. అదే సమయంలో కరోనా రావడంతో దీనిపై కొన్నిరోజులు ఆలోచించి స్క్రిప్ట్ లో కొన్ని ఛేంజెస్ చేశాను.”

Acharya : కాజల్‌ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం పేరు కూడా పలకట్లేదు?

 

”నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి లవ్‌ ఇంట్రస్ట్‌ పెడితే బాగోదనిపించింది. సినిమాలో ఏదో హీరోకి హీరోయిన్‌ ఉండాలి కదా అని ఒక పాత్రను సృష్టించి అంత పెద్ద హీరోయిన్‌తో చేయిస్తే బాగోదనిపించింది. ఆ పాత్రకి సపరేట్ గా హీరోతో పాట కూడా లేదు. ఇవన్నీ ఆలోచించి చిరంజీవికి చెప్తే కథకు ఏది అవసరమైతే అదే చెయ్యి అని అన్నారు. దీంతో ఈ విషయాన్ని కాజల్‌కి అర్థమయ్యేలా చెప్పాను. కాజల్ నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని మీ అందర్నీ మిస్‌ అవుతున్నాను. భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేద్దాం అని కూడా చెప్పారు. దీంతో కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుంది” అని తెలిపారు.

ఆచార్య సినిమాలో కాజల్ ఉండదు అని ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. లాహే లాహే సాంగ్ ని కూడా కాజల్ కనపడకుండా మళ్ళీ ఎడిట్ చేసినట్టు సమాచారం. దీంతో ఈ విషయం తెలుసుకున్న కాజల్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.