Kota Srinivasa Rao : కొత్త సినిమాలో కోట లుక్.. ఊపిరి ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటా..

విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు లేటెస్ట్ లుక్ చూసి తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు..

Kota Srinivasa Rao : కొత్త సినిమాలో కోట లుక్.. ఊపిరి ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటా..

Kota Srinivasa Rao

Kota Srinivasa Rao: కోట శ్రీనివాస రావు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని పేరు.. ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకాభిమానులను అలరించారాయన. సినీ, రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేశారు. ఆయన నటనకు ముగ్ధులై ప్రేక్షకులు ముద్దుగా మా కోట అని పిలుచుకుంటారు.

Annaatthe First Look : ‘అన్నాత్తే’ లుక్ అదిరిందిగా..!

అయితే ఆయన గతకొద్ది కాలంగా అనారోగ్య సమస్యసలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కోటకి అవకాశాలు తగ్గిపోయాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవల కోట గతంలో ‘మండలాధీశుడు’ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసి నెగెటివ్ ఇమేజ్ తెచ్చుకున్నారు.

Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!

అప్పట్లో రామారావు పాజిటివ్‌గా స్పందించినా బాలయ్య తనను తిట్టారని కోట చెప్పిన పాత ఇంటర్వూ తాలుకు న్యూస్ ఈమధ్య వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడాయన నటిస్తున్న కొత్త సినిమాలోని లుక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఆయన పోసాని కృష్ణమురళి, నరేన్‌, శరణ్య (మనం) ఫేమ్.. ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ‘చిత్రపటం’ సినిమాలో నటిస్తున్నారు. కవి బండారు దానయ్య దర్శకత్వంలో పుప్పాల శ్రీధర్‌రావు నిర్మిస్తున్నారు.

Ranveer Singh : ఏయ్.. నువ్వు నా హెయిర్ స్టైల్ కాపీ కొట్టావ్..!

కోట వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు. వయసురీత్యా వృద్ధాప్య కనిపిస్తుండడంతో.. ‘ఇన్నాళ్లు తన నటనతో మనల్ని అలరించిన కోట ఇలా అయిపోయారేంటి పాపం’ అంటూ తెలుగు ఆడియన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తుదిశ్వాస వరకు నటిస్తూనే ఉంటానని కోట సన్నిహితులతో చెప్పారని సమాచారం.

Kangana Ranaut : పూరి – ప్రభాస్ ఒక్క ఛాన్స్ ప్లీజ్..!