Ranveer Singh : ఏయ్.. నువ్వు నా హెయిర్ స్టైల్ కాపీ కొట్టావ్..!
శంకర్ - రామ్ చరణ్ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్‌లో రణ్‌వీర్ సింగ్ హెయిర్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి..

Ranveer Singh
Ranveer Singh: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబోలో రానున్న RC 15 సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై, మూవీ టీంకి విషెస్ తెలియజేశారు.
RC 15 : శంకర్ – రామ్ చరణ్ మూవీ ఓపెనింగ్ ఫొటోస్
చిరు, శంకర్, రాజమౌళి, చరణ్, కియారా అద్వానీ.. ఇంతమంది ఒకే ఫ్రేములో కనిపించడంతో ఆ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అలాగే రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ గురించిన న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమంలో చెర్రీ లగ్జీరియస్ అండ్ స్టైలిష్ రిచర్డ్ మిల్లె RM 61-01 యోహన్ బ్లేక్ (Richard Mille RM 61-01 Yohan Blake) వాచ్‌తో కనిపించారు.
Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!
ఇక్కడివరకు బాగానే ఉంది కానీ రణ్‌వీర్ సింగ్ మాత్రం తన కొత్త హెయిర్ స్టైల్‌తో అదరగొట్టేశాడు. రెండు పిలకలతో ఉన్న రణ్‌వీర్ పిక్స్ మామూలుగా వైరల్ అవట్లేదసలు. ఫొటోలతో పాటు మనోడి హెయిర్ స్టైల్ గురించి పలు మీమ్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి.

రణ్‌వీర్ హెయిర్ స్టైల్ ‘ఉపేంద్ర 2’ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్రలా ఉందంటూ మీమ్స్ చేశారు. అలాగే చరణ్, రణ్‌వీర్ ఇద్దరు ఫెరారి కార్ దగ్గర ఉన్న ఇమేజ్‌లో.. చెర్రీ.. ‘మీ హెయిర్ స్టైల్ ఎక్కడో చూసినట్టుందండీ’.. అంటే రణ్‌వీర్.. ‘అబ్బే లేదండీ.. ఎక్కడా చూసుండరు’.. అంటున్నట్లు మీమ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Kiara Advani : కియారా కమిట్‌మెంట్.. శంకర్‌తో ఎన్ని సినిమాలంటే..