F3 Movie: లబ్ డబ్ డబ్బో.. పైసా ఉంటే ప్రపంచమే పిల్లి!

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ ముఖ్య పాత్రలలో.. 'ఎఫ్ 2'కు సీక్వెల్​గా తెరకెక్కిన సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి దర్శకత్వం..

F3 Movie: లబ్ డబ్ డబ్బో.. పైసా ఉంటే ప్రపంచమే పిల్లి!

F3 Movie

F3 Movie: వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ ముఖ్య పాత్రలలో.. ‘ఎఫ్ 2’కు సీక్వెల్​గా తెరకెక్కిన సినిమా ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించినా ఈ సినిమా ఏప్రిల్ 28, 2022న థియేటర్లలో సందడి చేయనుంది. మూవీ ప్రమోషన్ ప్రారంభించేసిన మేకర్స్ అందులో భాగంగానే తాజాగా ఫస్ట్‌ సింగిల్‌ ‘’లబ్‌ డబ్‌ లబ్‌ డబ్ డబ్బు’’ సాంగ్‌ విడుదల చేశారు.

Sarkaru Vaari Paata: ఇక ఆగడు.. ప్రమోషన్ల స్పీడ్ పెంచిన మహేశ్!

దీంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగాయి. మొదటి నుంచి చెబుతున్నట్లు ఈ సినిమా పైసా చుట్టూ తిరిగే కథతో రానుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ప్రోమోలో వచ్చే పైస ఉంటే లోకమంతా డ్యాన్స్‌ క్లబ్‌ అనే చరణం ఆకట్టుకుంటోంది. పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించగా.. లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ.. డబ్బూ.. ఎవడు కనిపెట్టాడో దీన్ని గాని అబ్బో.. కాసులుంటే తప్ప కల్లు ఎత్తి చూడరబ్బో.. చిల్లిగవ్వ లేకుంటే నువ్వు పిండి రుబ్బో.. డబ్బూ.. డబ్బూ.. ప్యాకెట్ లోనా పైసా ఉంటే ప్రపంచమే పిల్లి అవుతుంది.. పులై మనం బతకచ్చు.. విశ్వదాభిరామా.. అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.

Khiladi: ఈ వారమే ఖిలాడీ రిలీజ్.. ప్రమోషన్ల హడావుడి లేదేంటి?

ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఈ పాటని రామ్ మిర్యాల పాడారు. భాస్కర భట్ల సాహిత్యం పాటను మరింత అందంగా మలిచగా.. విజువల్‌గా కూడా ఈ పాట ఎంతో స్టైలీష్‌గా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. పాట చివర్లో సినిమాలోని నటీనటులంతా కూడా డబ్బు రావాలని చేసే ప్రార్థనలు అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుండగా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు.