Vijay Devarakonda : ముంబైలో మెగాస్టార్‌తో లైగర్ టీం

తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూట్ ముంబైలో జరుగుతుంది. సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ పాటని అక్కడ తెరకెక్కిస్తున్నారు. దీంతో ముంబైలోనే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న లైగర్ టీం వెళ్లి గాడ్ ఫాదర్ షూటింగ్ సెట్ లో.............

Vijay Devarakonda : ముంబైలో మెగాస్టార్‌తో లైగర్ టీం

Liger :  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. పూరి జగన్నాధ్ దర్శక నిర్మాణంలో, కరణ్ జోహార్ మరో నిర్మాతగా, అనన్య పాండే హీరోయిన్ గా, బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ముఖ్యపాత్రలో ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమా కోసం సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఆృతతగా ఎదురుచూస్తున్నారు. లైగర్ సినిమా పాన్ ఇండియా వైడ్ ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నారు.

NTR : భార్యతో కలిసి కాఫీ తాగుతూ.. ఫారిన్ లో ఎన్టీఆర్..

ఈ సినిమాకి టాలీవుడ్, బాలీవుడ్ నుచి బాగానే సపోర్ట్ లభిస్తుంది. స్టార్ హీరోలు సైతం లైగర్ టీంకి, విజయ్ దేవరకొండకి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూట్ ముంబైలో జరుగుతుంది. సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ పాటని అక్కడ తెరకెక్కిస్తున్నారు. దీంతో ముంబైలోనే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న లైగర్ టీం వెళ్లి గాడ్ ఫాదర్ షూటింగ్ సెట్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ ని కలిశారు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, ఛార్మి వెళ్లి చిరు, సల్మాన్ ని కలిశారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సల్మాన్, చిరంజీవి లైగర్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.