NTR : భార్యతో కలిసి కాఫీ తాగుతూ.. ఫారిన్ లో ఎన్టీఆర్..

ఎన్టీఆర్ షేర్ చేసిన ఫొటోలో.. ఒక పచ్చని ప్రదేశంలో భార్య ప్రణతికి ఎదురుగా కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్తున్నాడు ఎన్టీఆర్. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తన భార్యతో కలిసి.....

NTR : భార్యతో కలిసి కాఫీ తాగుతూ.. ఫారిన్ లో ఎన్టీఆర్..

Ntr

NTR :  ఇటీవల హీరోలు ఖాళీ దొరికితే చాలు విదేశాలకి చెక్కేస్తున్నారు. ముఖ్యంగా మన స్టార్ హీరోలు. మహేష్ బాబు కొంచెం ఖాళీ దొరికినా చాలు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్తూ ఉంటారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కోవలో ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్ కూడా ఈ మధ్య గ్యాప్ దొరికితే ఫారిన్ చెక్కేస్తున్నారు ఫ్యామిలీతో కలిసి.

RRR సినిమా రిలీజ్ తర్వాత ఖాళీ రావడంతో కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్ వేశారు ఎన్టీఆర్. కొరటాల శివతో మొదలవ్వాల్సి ఎన్టీఆర్ సినిమాకి ఇంకా వాయిదా పడుతుంది. దాంతో పాటు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అవ్వడంతో మరోసారి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్ళాడు ఎన్టీఆర్. ఈసారి ఇంగ్లాండ్ వెళ్లినట్టు తెలుస్తుంది. గతంలో తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు తన భార్య ప్రణతితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు.

Anupama Parameswaran : నా ఇబ్బంది మీరు అర్ధం చేసుకోవాలి.. కార్తికేయ 2 ప్రమోషన్స్ లో అందుకే పాల్గొనట్లేదు..

ఎన్టీఆర్ షేర్ చేసిన ఫొటోలో.. ఒక పచ్చని ప్రదేశంలో భార్య ప్రణతికి ఎదురుగా కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్తున్నాడు ఎన్టీఆర్. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తన భార్యతో కలిసి ఇలాంటి క్యూట్ పిక్ షేర్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)