Mahesh Babu: మహేష్ డబుల్ ట్రీట్.. తూచ్ అంట!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడనే వార్త మహేష్ అభిమానులను ఊరిస్తూ వస్తోంది. అయితే ఈ వార్త కేవలం పుకారే అని చిత్ర యూనిట్ కొట్టిపారేస్తోంది.

Mahesh Babu: మహేష్ డబుల్ ట్రీట్.. తూచ్ అంట!

Mahesh Babu Not Doing Dual Role In Trivikram Movie

Updated On : July 26, 2022 / 7:30 PM IST

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమాను తెరకెక్కించేందుకు మహేష్ సిద్ధమయ్యాడు. ఈ సినిమాను అధికారికంగా లాంచ్ కూడా చేశారు.

Mahesh Babu: పుట్టినరోజునే ముహూర్తం పెట్టిన మహేష్..?

అయితే ఈ సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడనే వార్త మహేష్ అభిమానులను ఊరిస్తూ వస్తోంది. అయితే ఈ వార్త కేవలం పుకారే అని చిత్ర యూనిట్ కొట్టిపారేస్తోంది.

Mahesh Babu: మహేష్ టార్గెట్ సెంచరీ.. ఇక త్రివిక్రమ్‌దే ఆలస్యం!

మహేష్ బాబు నటించబోయే సినిమాలో ఆయన కేవలం సోలో హీరోగా మాత్రమే కనిపిస్తాడని.. ఈ సినిమాలో ఆయన డ్యుయెల్ రోల్ ఏమీ చేయడం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.