Mahesh Babu: మహేష్ టార్గెట్ సెంచరీ.. ఇక త్రివిక్రమ్‌దే ఆలస్యం!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి....

Mahesh Babu: మహేష్ టార్గెట్ సెంచరీ.. ఇక త్రివిక్రమ్‌దే ఆలస్యం!

Mahesh Babu Allots 100 Days For Trivikram Movie

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Mahesh Babu: త్రివిక్రమ్ సరికొత్త మహేష్‌ను చూపిస్తాడా..?

ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన మహేష్, ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ కూడా చేశారు. అయితే రెగ్యులర్ షూటింగ్‌కు మాత్రం ఇంకా సమయం పడుతుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కోసం మహేష్ బల్క్ డేట్స్‌ను కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా 100 రోజుల సమయాన్ని త్రివిక్రమ్‌కు ఇచ్చాడట మహేష్.

Mahesh Babu: త్రివిక్రమ్‌కు మహేష్ సలహా..?

ఈ 100 రోజుల్లోనే సినిమాను పూర్తి చేయాలని త్రివిక్రమ్‌కు మహేష్ కండీషన్ కూడా పెట్టాడట. ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మహేష్ భావిస్తున్నాడట. తనకు ఎంతో కలిసొచ్చే సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మహేష్ ఉవ్విళ్లూరుతున్నాడట. అయితే త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ కేవలం 100 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయగలడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి అంశాన్ని పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకునే త్రివిక్రమ్, ఏదైనా తేడా అనిపిస్తే, దాన్ని మళ్లీ సరిదిద్ది పర్ఫెక్ట్ ఔట్‌పుట్‌ను అందిస్తాడు. మరి ఇలాంటి త్రివిక్రమ్‌కు మహేష్ ఇచ్చిన 100 రోజుల డేట్స్ సరిపోతాయో లేవో తెలియాలంటే ఈ సినిమా పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.