Mahesh Babu: త్రివిక్రమ్ సరికొత్త మహేష్‌ను చూపిస్తాడా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే....

Mahesh Babu: త్రివిక్రమ్ సరికొత్త మహేష్‌ను చూపిస్తాడా..?

Mahesh Babu Never Before Appearance In Trivikram Movie

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన విధానం సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్, అతడి యాటిట్యూడ్, డైలాగ్స్‌కు ప్రేక్షకులు చాలా ఇంప్రెస్ అయ్యారు.

Mahesh Babu: త్రివిక్రమ్‌కు మహేష్ సలహా..?

మహేష్‌ను ఇలాంటి ఊరమాస్ అవతారంలో చూసి చాలా రోజులు కావడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి నెవర్ బిఫోర్ అవతారంలో కనిపించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా లాంఛ్ చేయగా, రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టులో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో మరోసారి మహేష్ తన సరికొత్త మేనరిజం, లుక్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనున్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu: ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొడతానంటోన్న మహేష్..?

త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. మరి ఇలాంటి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కావడం.. ఈ సినిమాలో మహేష్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చూపించేందుకు త్రివిక్రమ్ ఎలాంటి ప్లాన్ చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.