Mahesh Babu: పుట్టినరోజునే ముహూర్తం పెట్టిన మహేష్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సర్కారు వారి పాట’ చిత్రంతో అదిరపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల.....

Mahesh Babu: పుట్టినరోజునే ముహూర్తం పెట్టిన మహేష్..?

Mahesh Babu To Start Shoot Of Ssmb28 On His Birthday

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సర్కారు వారి పాట’ చిత్రంతో అదిరపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించగా, మాస్ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు మహేష్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

Mahesh Babu: త్రివిక్రమ్ సరికొత్త మహేష్‌ను చూపిస్తాడా..?

ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్ర యూనిట్, ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు మహేష్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో, ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 9న ప్రారంభించాలని మహేష్ భావిస్తున్నాడు.

Mahesh Babu: మహేష్ పాటకు మణిశర్మ, కోటి, థమన్‌ల ‘మ్యూజిక్ మ్యాజిక్’!

అదే రోజున ఈ సినిమా షూటింగ్‌ను ఎందుకు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు అంటే.. దానికీ ఓ కారణం ఉందట. ఆ రోజున మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో, అభిమానులకు బర్త్‌డే ట్రీట్‌గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కోసం అదిరిపోయే కథను రెడీ చేశాడని, ఈ సినిమాతో మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఫిక్స్ చేయగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.