Sarkaru Vaari Paata: సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్న మహేష్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది...

Sarkaru Vaari Paata: సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్న మహేష్..?

Mahesh Babu Himself To Grace Sakraru Vaari Paata Pre Release Event

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను ‘గీతా గోవిందం’ ఫేం దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్ గ్లింప్స్, సాంగ్స్, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

Sarkaru Vaari Paata: మహేష్ దూకుడు.. యూట్యూబ్ లో ఎస్వీపీ ట్రైలర్ రికార్డులు!

ఈ సినిమా రిలీజ్‌కు దగ్గరవుతుండటంతో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. తాజాగా సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మే 7న సాయంత్రం 6 గంటల నుండి యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ ఈవెంట్‌కు గెస్ట్ ఎవరనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ సైలెంట్‌గా ఉంది. దీంతో సర్కారు వారి పాట చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టులెవరూ లేరని తెలుస్తోంది. ఈ సినిమాకు మహేష్ అన్నీ తానై ప్రమోషన్స్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇతర హీరోల సినిమాలకు మహేష్ గెస్ట్‌గా వెళ్తుండటంతో, ఇప్పుడు తన సినిమాకు తానే ప్రమోట్ చేసుకోవడం చాలా స్పెషల్‌గా మారిందని చెప్పాలి.

Sarkaru Vaari Paata: దొంగలెత్తుకెళ్లిన కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్.. ఏం జరిగిందంటే?

ఇప్పటివరకు ఏ హీరో కూడా తన సినిమాను తానే ప్రమోట్ చేసుకున్నది లేదు. సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్న మహేష్ ఇతర హీరోలకు ఇన్‌స్పిరేషన్ అవుతాడని పలువురు సినీ క్రిటిక్స్ అంటున్నారు. అయితే సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా లేకపోతే మహేష్ ఇలాంటి స్టెప్ వేస్తాడని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను కూడా మహేష్ ఓ ఆట ఆడుకోవడం ఖాయమని వారు అంటున్నారు. నిజంగానే సర్కారు వారి పాట చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టులెవరూ లేరా.. లేక చిత్ర యూనిట్ సస్పెన్స్‌గా పెట్టాలని చూస్తుందా.. అనే అంశంపై క్లారిటీ రావాలంటే, ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక సర్కారు వారి పాటలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు.