Sarkaru Vaari Paata: మహేష్ దూకుడు.. యూట్యూబ్ లో ఎస్వీపీ ట్రైలర్ రికార్డులు!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

Sarkaru Vaari Paata: మహేష్ దూకుడు.. యూట్యూబ్ లో ఎస్వీపీ ట్రైలర్ రికార్డులు!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Sarkaru Vaari Paata: దొంగలెత్తుకెళ్లిన కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్.. ఏం జరిగిందంటే?

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ చిత్రంపై అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేయగా, ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. సమ్మర్ ట్రీట్‌గా రాబోతున్న ఈ సినిమాను మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ పెంచేసిన ఎస్వీపీ టీం సోమవారం ట్రైలర్ రిలీజ్ చేసింది. మహేష్ మార్క్ మేనరిజంతో వచ్చిన యాక్షన్ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

Sarkaru Vaari Paata: ట్రైలర్‌తో అంటుకున్న మాస్ ఫైర్.. ఆకాశానికి అంచనాలు!

యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ఇప్పటికే 30 మిలియన్స్‌కి పైగా పైగా వ్యూస్ దక్కించుకొని రికార్డులను సృష్టిస్తుంది. అలాగే 1.2 మిలియన్స్ పైగా లైక్స్ తో యూట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా యూఎస్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నడు లేని విధంగా యూఎస్ లో 603 ప్రాంతాల్లో ఈ సినిమాను రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా కాకుండా ఓ తెలుగు సినిమా ఇన్ని ప్రదేశాల్లో విడుదల కావడం ఇదే తొలిసారి.