Sarkaru Vaari Paata: ముచ్చటగా మూడోసారి.. హాలీవుడ్ సినిమాలతో మహేష్ మూవీ క్లాష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ సూపర్ హీరోస్ తో పోటీ పడటం కామన్ అయిపోతోంది. ఏదో అలాంటి ఇలాంటి సినిమాలు కాదు.. ఏకంగా హాలీవుడ్ హై బడ్జెట్ మూవీస్ తో పోటీపడుతున్నారు..

Sarkaru Vaari Paata: ముచ్చటగా మూడోసారి.. హాలీవుడ్ సినిమాలతో మహేష్ మూవీ క్లాష్!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ సూపర్ హీరోస్ తో పోటీ పడటం కామన్ అయిపోతోంది. ఏదో అలాంటి ఇలాంటి సినిమాలు కాదు.. ఏకంగా హాలీవుడ్ హై బడ్జెట్ మూవీస్ తో పోటీపడుతున్నారు సూపర్ స్టార్. భరత్ అనే నేను నుంచి లేటెస్ట్ సర్కార్ వారి పాట వరకు మహేష్ మార్వెల్ స్టూడియోస్ సినిమాలతో క్లాష్ అవుతూనే ఉన్నాడు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుండి మరో అప్‌డేట్ రానుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట ఈ ఏడాది మే 12న రిలీజ్ కానుంది. ఇదే నెలలో అంటే మే 6న మార్వెల్ స్టూడియోస్ నుంచి హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీ వెర్స్ ఆఫ్ మాడ్నెస్ సినిమా రిలీజ్ కానుంది. దీంతో మూడవ సారి మహేశ్ బాబు సినిమా, మార్వెల్ స్టూడియోస్ వారి సినిమాతో క్లాష్ అవుతోంది. అయితే సర్కార్ వారి పాట ఓవర్సీస్ కలెక్షన్స్ పైన మార్వెల్ స్టూడియోస్ మూవీ ప్రభావం గెట్టిగానే పడుతుందని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశేనా..?

గతంలో మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమా రిలీజ్ టైమ్ లో మార్వెల్ స్టూడియోస్ వారి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ రిలీజ్ అయ్యింది. దాంతో భరత్ అనే నేను ఓవర్సీస్ కలెక్షన్స్ 4 మిలియన్ మార్క్ ను టచ్ చేయలేక పోయింది. 20 కోట్ల వసూళ్లకే పరిమితమైంది. రెండోసారి మహేశ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ పైన మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ హాలీవుడ్ మూవీ ఎఫెక్ట్ పడింది. కాబట్టే మహర్షి ఓవర్సీస్ కలెక్షన్స్ 2 మిలియన్స్ అంటే దాదాపు 14 కోట్ల కలెక్షన్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Sarkaru Vaari Paata: పెన్నీ సాంగ్.. మహేష్ క్రేజ్‌కు మరో మచ్చుతునక!

ఇప్పుడు కో ఇన్సిడెంట్ గా థర్డ్ టైమ్ మార్వెల్ స్టూడియోస్ వారి డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీ వెర్స్ ఆఫ్ మాడ్నెస్ తో సర్కార్ వారి పాటకు పోటీ తప్పడం లేదు. ఈరెండు సినిమాలు మే 12 నే రిలీజ్ అనౌన్స్ చెయ్యడంతో మరోసారి రిలీజ్ క్లాష్ ఫేస్ చేస్తున్నాయి ఈ రెండు సినిమాలు. సో ఈ హాలీవుడ్ సినిమా మహేశ్ బాబు సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ పైన ఏ రేంజ్ ప్రభావం చూపుతుందో అని ఆందోళన చెందుతున్నారు మహేశ్ ఫ్యాన్స్. అసలే తమ అభిమాన హీరో సినిమా వచ్చి చాలా కాలం అవుతుండటంతో, లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి రికార్డులు బద్దలు కొడతాడనుకుంటే.. ఇప్పుడు ఈ హాలీవుడ్ మూవీ అడ్డంపడడంతో కలెక్షన్ల సంగతి ఏంటా అని ఆలోచనలో పడ్డారు మేకర్స్ కూడా.