Sarkaru Vaari Paata: పెన్నీ సాంగ్.. మహేష్ క్రేజ్‌కు మరో మచ్చుతునక!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు.....

Sarkaru Vaari Paata: పెన్నీ సాంగ్.. మహేష్ క్రేజ్‌కు మరో మచ్చుతునక!

Penny Song From Sarkaru Vaari Paata Crossed 20 Million Plus Views

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో మనకు కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని, చిత్ర టీజర్, సాంగ్స్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వచ్చాయి.

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ నుంచి రెండో సాంగ్ రిలీజ్‌కి రెడీ

ఇక ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘కళావతి’ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో దుమ్ములేపింది. ఈ పాటకు యూట్యూబ్‌లో 100 మిలియన్‌కు పైగా వ్యూస్ రావడంతో ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి పెన్నీ అనే రెండో సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటకు థమన్ అల్ట్రా స్టైలిష్ ట్యూన్స్ ఇవ్వగా, ఈ పాట వీడియోలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని కూడా కనిపించడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకున్నారు. ఇక ఈ పాట తాజాగా యూట్యూబ్‌లో 20 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.

Sarkaru Vaari Paata: సెంచరీ కొట్టిన కళావతి.. మహేష్ స్టెప్స్‌కు జనం ఫిదా!

దీంతో మహేష్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో మరోసారి ప్రూవ్ అయ్యిందని అభిమానులు అంటున్నారు. మహేష్ సరసన ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాను వేసవి కానుకగా మే నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సర్కారు వారి పాటతో మహేష్ మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.