Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ నుంచి రెండో సాంగ్ రిలీజ్‌కి రెడీ..

ఇక ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమా నుంచి వచ్చిన మొదటి పాట 'కళావతి..' సాంగ్ భారీ హిట్ అయింది. తాజాగా 'సర్కారు వారి పాట' సినిమా నుంచి రెండో సాంగ్ రానుంది. పెన్నీ సాంగ్ అంటూ......

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ నుంచి రెండో సాంగ్ రిలీజ్‌కి రెడీ..

Sarkaru Vari Mata

 

Sarkaru Vaaari Paata :  మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. పరుశురాం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇక ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట ‘కళావతి..’ సాంగ్ భారీ హిట్ అయింది. తమన్ సంగీత దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట బాగా పాపులర్ అయింది. ఇందులో మహేష్ బాబు వేసిన స్టెప్ కూడా బాగా వైరల్ అయింది. యూట్యూబ్ లో కళావతి సాంగ్ ట్రెండింగ్ లో నిలవగా, సోషల్ మీడియాలో ఈ పాటతో పాటు స్టెప్పు కూడా వైరల్ అయింది. చాలా మంది ఈ సాంగ్ కి రీల్స్ చేశారు. సెలబ్రిటీలు సైతం మహేష్ వేసిన స్టెప్ వేసి రీల్స్ చేసి సాంగ్ ని మరింత వైరల్ చేశారు.

James : పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్ థియేటర్స్..

తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి రెండో సాంగ్ రానుంది. పెన్నీ సాంగ్ అంటూ మహేష్ ఫొటోతో పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. పెన్నీ అంటే డబ్బులు అని అర్ధం వస్తుంది. దీంతో ఈ పాట డబ్బుల గురించి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి రెండో సాంగ్ గా ఈ పెన్నీ సాంగ్ మార్చ్ 20 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు ఆసక్తిగా ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు.